దాదాపు రెండు వారాల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం సంచలనంగా మారటం తెలిసిందే. దీని ప్రకంపనలు నేరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత మీదకు రావటం తెలిసిందే. అనంతరం బీజేపీ నేతలు కవిత మీద తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళ.. కోర్టును ఆశ్రయించిన కవిత.. తన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పేర్కొనటం.. అనవసర వ్యాఖ్యలు చేయకుండా కోర్టు ఆదేశాల్ని తెచ్చుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈడీ.. బోడీలకు తాము భయపడమని.. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో కుదరదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వ్యాఖ్యలు చేయటం.. మీడియాతో మాట్లాడిన సందర్భంగా కవిత సైతం.. ఈడీ.. బోడీ అంటూ తేలిగ్గా తీసేయటం కనిపించింది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం మౌనంగా ఉండటం కూడా కనిపించినప్పుడు..
అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ.. ఈరోజు (మంగళవారం) ఉదయం దేశ వ్యాప్తంగా దాదాపు 30 చోట్లకు పైనే ఈడీ సోదాలు నిర్వహిస్తున్న వైనం బయటకు వచ్చి సంచలనంగా మారింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో ఈడీ సోదాలకు దిగటం.. అందులో ఢిల్లీ.. హైదరాబాద్.. లక్నో.. గురుగావ్.. బెంగళూరు.. చెన్నై లాంటి ముఖ్య నగరాల్లో తనిఖీల్ని నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అధికారుల ఫోకస్ మొత్తం రాబిన్ డిసిలర్స్ పేరుతో బిజినెస్ నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లై నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మరో ఐదుగురు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. బోయినపల్లి అభిషేక్ రావు.. సూదిని సృజన్ రెడ్డి.. గండ్ర పేమ్ సాగర్ నివాసాలు.. ఆఫీసులకు ఈడీ అధికారులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అభిషేకరావు..
ప్రేమ్ సాగర్ రావులు కవిత వద్ద పని చేస్తారని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న తనిఖీలు మొత్తం కవితకు సన్నిహితంగా ఉన్న వారే లక్ష్యంగా జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు వారాల మౌనం తర్వాత.. పక్కా గ్రౌండ్ వర్కుతో తాజా దాడులు జరుగుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా తాజా సోదాలతో రాజకీయ సంచలనం అంతో ఇంతో ఖాయమన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.