ఒక విజయం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందంటారు. ఆ మాటలో నిజం ఎంతన్న సందేహం అక్కర్లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సొంతం చేసుకున్న విజయం వాపు కాదన్న విషయాన్ని గ్రేటర్ ఎన్నికల ఫలితంతో స్పష్టం చేశారు కమలనాథులు. ప్రస్తుతం 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని చెబుతున్న బీజేపీ నేతలు.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారో క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న బీజేపీ మహా ఉత్సాహంగా ఉంది. తమ ఖాతాల రెండు విజయాలతోనే.. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో వారున్నారు. ఇలాంటివేళ.. తెలంగాణకు వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎలాంటి సీఎంను తాము ఎంపిక చేస్తామన్న విషయంపై స్పష్టత ఇచ్చారు.
‘‘ఏ రాజా సాబ్ కుమారుడో..అల్లుడో.. నిజాం చెంచానో సీఎం కాడు’’ అని చెప్పటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికలతో టీఆర్ఎస్ కు ట్రైలర్ మాత్రమే చూపించామని.. అసలుసినిమా ముందు ఉందన్న ఆయన.. నిజాం పాలనతో పాటు అవినీతిని అంతమొందించే వరకూ బీజేపీ నిద్రపోదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి.. ఆయన కుమారుడి మీద తీవ్ర విమర్శలు చేశారు.
దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో తండ్రీ కొడుకులు.. కొన్ని రాష్ట్రాల్లో తల్లీబిడ్డల పాలన చూశామన్నారు. తెలంగాణలో మాత్రం హిందూ అవిభాజ్య కుటుంబ పాలన సాగుతోందన్నారు. తండ్రి.. కొడుకు..కూతురు.. అల్లుడు.. ఆత్మబంధువు (మజ్లిస్) తో కూడిన కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతుందన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేయటంలో ఈ కుటుంబంలోని వారు ఒకరికొకరు పోటీ పడుతున్నారన్నారు.
టీఆర్ఎస్ తో తాము చేస్తున్నది డూప్ ఫైట్ కానే కాదని.. ఆ పార్టీతో ఎన్నికల కుస్తీకి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావటమే లక్ష్యమన్న ఆయన.. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మొత్తానికి కేసీఆర్ కుటుంబ పాలనపై విరుచుకుపడిన కమలనాథుల వ్యాఖ్యలకు గులాబీ నేతలు ఏమని బదులిస్తారో చూడాలి.