రచయిత్రి తస్లీమా నస్రీన్ అకౌంట్ ను ఫేస్ బుక్ అందుకే బ్లాక్ చేసిందట?

Update: 2021-11-02 02:30 GMT
బంగ్లాదేశ్ లో కొద్దిరోజులుగా హిందువులపై, హిందూ ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. పలు చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసం అవుతున్నాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హిందువులపై దాడుల విషయంలో బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్ తాజాగా స్పందించారు. తనదైన శైలిలో మాటల తూటాలుపేల్చారు. సోషల్ మీడియా లో కొన్ని పోస్టులు చేశారు.

తస్లీమా నస్రీన్ పోస్టులను పరిగణలోకి తీసుకున్న ఫేస్ బుక్ ఆమె ఖాతాను ఏడు రోజుల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై స్పందించారు. 'ఇస్లాంకు చెందిన కొందరు హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులకు దిగుతున్నారని నేను పోస్టు చేసినందుకు ఫేస్ బుక్ నా అకౌంట్ ను బ్లాక్ చేసింది. హిందూ దేవుడి కాళ్ల వద్ద ఖురాన్ ఉంచారని ఈ దాడులు చేశారని.. కానీ ఇలా చేసింది హిందువులు కాదని.. ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి అని' తస్లీమా చెప్పుకొచ్చింది. అతడిని మాత్రం ఎవరూ ఏం చేయడం లేదని ట్వీట్ చేసింది.

తస్లీమా ఫేస్ బుక్ ను నిషేధించడం ఇదే తొలిసారి కాదు.. ఈ ఏడాది మార్చి 16న కూడా జిహాదీ అని ఓ దుకాణం యజమానిపై పోస్ట్ చేసినందుకు ఒక రోజు నిషేధించింది. 2015లోనూ ఓ సారి ఫేస్ బుక్ తస్లీమా ఖాతాను బ్లాక్ చేసింది. తాజాగా మరోసారి ఆ  పని చేసింది.

తస్లీమా 1993లో రాసిన 'లజ్జా' నవల వివాదాస్పదమైంది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. 1994లో బంగ్లాదేశ్ ను వదిలిపెట్టిన తస్లీమా అప్పటి నుంచి భారత్ లోని ఢిల్లీలో తలదాచుకుంటున్నారు.
Tags:    

Similar News