దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలి కాలంలో మృగాళ్ల ఆగడాలు మరింతగా పెరిగాయనే చెప్పాలి. నిర్భయ ఘటన తర్వాత కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా కూడా ఢిల్లీలో అత్యాచారాలకు తెర పడిన దాఖలాలు కనిపించడం లేదు. మొన్నటిదాకా ఒంటరిగా వెళ్లేందుకు భయపడిపోయిన మహిళలు ఇప్పుడు బృందాలుగా వెళ్లాలన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పదు. భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీయురాలు హస్తిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాగుతున్న వేళ... ఓ మృగాడు ఆమెను చూస్తే... ఆమె పక్కనే నిలబడి హస్తప్రయోగం చేసిన తీరుకు నిజంగానే ఆ మహిళ చాలా ఇబ్బంది పడింది. ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయా? అన్న కోణంలో నాడు ఆ వార్త పెద్ద సంచలనమే రేపింది. అయితే ధైర్యం తెచ్చుకుని ఆ పాడు పనిని ఆపేందుకు ఆ విదేశీయురాలు ఆ వ్యక్తిపై కేకలు వేస్తే... అతడు ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా నాటి వార్తా కథనాల్లో వచ్చిన సంగతి తెలిసిందే.
అలాంటి ఘటన కంటే కాస్తంత గాఢత ఎక్కువగా ఉన్న ఘటన మొన్న ఢిల్లీలోనే చోటుచేసుకుంది. ఓ నడివయసు మగానుభావుడు... రద్దీగా ఉన్న బస్సులో తన పక్కన ఓ యువతి కూర్చుని ఉండగా.. ఆమె వైపే తీక్షణంగా చూస్తూ... అక్కడే తన మర్మాంగాన్ని బయటకు తీసి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న పక్క సీటులోని యువతి... అతడికి బుద్ధి చెప్పే క్రమంలో మొత్తం ఘటనను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన కూడా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగానే మారిపోయింది. అత్యాచారాలు అడ్డే లేకుండా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి పాడు పనులు కూడా యథేచ్ఛగా సాగుతున్నాయని ఈ ఘటనతో తేలిపోయింది.
సరే ఈ ఘటన జరిగింది.. దానిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు చర్యలకు ఉపక్రమించడం అంతా తెలిసిందే. దాదాపుగా జనం మదిలో నుంచి కనునమరుగవుతున్న ఈ ఘటనపై ప్రముఖ రచయిత్రి, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న తస్లీమా నస్రీన్ మరోమారు చర్చ జరిగేలా వ్యవహరించారు. ఘటన జరిగిన నాడు జరిగిన చర్చ కంటే కూడా తస్లీమా వ్యాఖ్యలతో ఇప్పుడు దీనిపై మరింత మేర విస్తృత చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా తస్లీమా ఏం చేశారన్న విషయానికి వస్తే... రేప్ లు నిత్యకృత్యమైన వేళ బహిరంగ హస్తప్రయోగం పెద్ద నేరం కాదు కదా అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తస్లీమా దీనిపై సంచలన కామెంట్లే చేశారు.
అయినా తన ట్వీట్‌లో తస్లీమా ఏమన్నారంటే... *రద్దీగా ఉన్న ఢిల్లీ బస్సులో ఓ వ్యక్తి హస్తప్రయోగం చేశాడు. అత్యాచారాల సంస్కృతి పెచ్చరిల్లుతున్న ప్రస్తుత యుగంలో ఇదేమీ అంత పెద్ద నేరం కాదు. అత్యాచారాలు, హత్యలకు బదులు పురుషులు హస్తప్రయోగం సరిపెట్టుకోవడం మంచిదేగా. అయినా బహిరంగ హస్త ప్రయోగం నేరమా? సరే... ఇది నేరమైనా... బాధితులు లేని నేరంగా చెప్పుకోవచ్చు* అని తస్లీమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తస్లీమా ట్వీట్ పై ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఓ పెద్ద చర్చే నడుస్తోంది. తస్లీమా వ్యాఖ్యలను ఒకరిద్దరూ సమర్దించగా... మెజారిటీ మంది మాత్రం ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.