తెలుగు రాష్ట్రాలు ఈ ఆరేళ్ళలో కేంద్రానికి కట్టిన పన్నుఎంత?

Update: 2019-10-29 01:30 GMT
గత ఆరేళ్లలో కాలంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం రూ.50.67 లక్షల కోట్లు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇటీవలి డేటా ప్రకారం మహారాష్ట్ర - ఢిల్లీ - కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న డైరెక్ట్ ట్యాక్స్ 61 శాతంగా ఉంది. గుజరాత్ - తమిళనాడు కూడా కలిస్తే ఈ ఐదు రాష్ట్రాల నుండే కేంద్రానికి  72 శాతం రెవెన్యూ వస్తోంది.

ఇక ఛత్తీస్‌ గఢ్ - ఒడిశా - కర్ణాటక - తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కేరళ - తమిళనాడు ఏడు రాష్ట్రాలను దక్షిణ భారత రాష్ట్రాలుగా చెబుతారు. మహారాష్ట్రను అటు నార్త్‌ కు - ఇటు సౌత్‌ కు మధ్యగా ఉంది. దీన్ని కూడా సౌత్ కిందకు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 62శాతం వరకు ఉంది. గత ఆరేళ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు రూ.12 లక్షల కోట్ల రెవెన్యూ ఉంటే కేవలం మహారాష్ట్ర నుంచి దాదాపు రూ.20 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం కేంద్రానికి ఉంది. మహారాష్ట్రను కలుపుకుంటే 8 దక్షిణాది రాష్ట్రాల నుంచే యాభై శాతానికి పైగా ఉండటం గమనార్హం.

మహారాష్ట్ర తర్వాత వరుసగా కర్ణాటక - తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ - తెలంగాణ - ఛత్తీస్‌ గఢ్ - ఒడిశా రాష్ట్రాలు 1 లక్ష కోట్ల కంటే దిగువన ఉన్నాయి. ఆరేళ్లలో మహారాష్ట్ర వాటా 37.85 శాతమైతే కర్ణాటక వాటా 9.8 శాతం - తమిళనాడు వాటా 6.7 శాతంగా ఉన్నాయి. ఈ మూడు కలిపి 54.3 శాతంగా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచే రూ.19.17 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. ఈ ఆరేళ్లలో మహారాష్ట్ర వాటా 37.85 శాతం కావడం` విశేషం. ఈ ఆరేళ్ళ కాలంలో  తెలంగాణ  రూ.0.23 లక్షల కోట్లు - ఆంధ్రప్రదేశ్  రూ.2.20 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించింది. మొత్తంగా మహారాష్ట్రతో కలుపుకొని ..దక్షిణాది నుంచి రూ.31.58 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. అంటే 62 శాతం వాటా ఉంది.


Tags:    

Similar News