దేశంలోనే నెం.1 ఐటీ కంపెనీగా TCS‌.. అతి త్వ‌ర‌లో అద్భుత‌మై ఘ‌న‌త‌‌!

Update: 2021-04-15 01:30 GMT
దేశీయ ఐటీ కంపెనీల్లో TCS (TATA Consultancy services) ఘ‌న‌త ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. 1968లో ఏర్పాటైన ఈ ఐటీ కంపెనీ.. ఇంతింతై అన్న‌ట్టుగా ఎదుగుతూ దేశంలోనే అగ్ర‌గామి సంస్థ‌గా మారింది. దేశ‌, విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఎగుమ‌తులు చేప‌డుతూ దూసుకెళ్తోంది. భార‌త దేశం నుంచి అత్య‌ధిక ఎక్స్ పోర్ట్స్ చేస్తున్న ఐటీ కంపెనీ కూడా TCS కావ‌డం గ‌మ‌నార్హం.

ఇంత ప్ర‌ఖ్యాతి సాధించిన TCS.. త్వ‌ర‌లో అద్భుత‌మైన ఘ‌న‌త సాధించ‌బోతోంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2020-21) ముగిసేనాటికి ఈ సంస్థ‌లో మొత్తం 4,88,649 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే.. అతి త్వ‌ర‌లోనే ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5 ల‌క్ష‌ల మందికి చేర‌బోతోంది. ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన‌ భార‌తీయ ఐటీ కంపెనీగా TCS రికార్డు సృష్టించ‌బోతోంది.

అయితే.. ఇప్ప‌టికీ అత్య‌ధిక ఉద్యోగులు ఉన్న కంపెనీ TCS మాత్ర‌మే. రెండో స్థానంలో ఇన్ఫోసిస్ ఉండ‌గా.. ఈ రెండు కంపెనీల మ‌ధ్య‌ స‌గానికిపైగా అంత‌రం ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,42,371 మంది మాత్ర‌మే.

ఇందులో గొప్ప విష‌యం ఏమంటే.. క‌రోనా దెబ్బ‌కు ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోగా.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో TCS 40 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వ‌డం విశేషం. గ‌డిచిన‌మూడు నెల‌ల్లోనే దాదాపు 20 వేల మందికి ఉద్యోగాలు క‌ల్పించింది. ఈ ఆర్థిక ‌సంవ‌త్స‌రంలో మ‌రో 40 మంది కొత్త‌వారికి ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది TCS. అతి త్వ‌ర‌లోనే 5 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల మార్క్ చేరుకొని అరుదైన ఘ‌న‌త సాధించ‌బోతోంది.
Tags:    

Similar News