లాక్ డౌన్ విధించడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా - ప్రపంచంలో కూడా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. అంతోఇంతో సాఫ్ట్ వేర్ రంగం కార్యక్రమాలు కొంత జరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో ఉద్యోగులు ఆన్ డ్యూటీలో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. అయినా సాధారణ స్థితిలో ఉన్నట్టు ఉద్యోగుల సేవలు లేవు. దీంతో కొంత మందగమనంలోనే సాఫ్ట్ వేర్ కార్యకలాపాలు కొనసాగుతుండడంతో ఆ సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. గతంలోనే ఆర్థిక పరిస్థితులు ఉండగా తాజాగా పరిస్థితి మరింత గడ్డుగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది.
గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసిక మాసంలో సంస్థకు లాభాలు వచ్చినా కొద్దిమొత్తంలో వచ్చింది. ఈ క్రమంలో చాలామందికి ఉద్వాసన పలుకుతారని ఆ సంస్థ ఉద్యోగుల్లో చర్చ సాగింది. దీనికి తోడు ఇప్పుడు లాక్ డౌన్ ఉండడంతో మరింత ఆందోళనలో పడ్డారు. ఈ సందర్భంగానే విధిగా లాక్ డౌన్ వేళ వర్క్ ఫ్రమ్ హోమ్ లోనూ విధులు పక్కాగా నిర్వహిస్తున్నారు. అయితే ఉద్యోగుల ఆందోళనను గమనించిన టీసీఎస్ వారి భయాందోళనలను తొలగిస్తూ శుభవార్త కాదు కానీ వారికి ఉపశమనం ఇచ్చే వార్త వినిపించింది. ఉద్యోగులను తొలగించమని స్పష్టంగా చెబుతూనే జీతాల పెంపు (ఇంక్రిమెంట్) ఉండదని పేర్కొంది.
ఈ త్రైమాసికంలో తమ నికర లాభం రూ.8,046 కోట్లు అని టీసీఎస్ ప్రకటించింది అయితే గతేడాది లాభం రూ.8,126 ఉంది. ఈసారి లాభం వచ్చిన తక్కువ మొత్తంలో రావడానికి కారణం కరోనా వైరస్ గా పేర్కొంది. ఇప్పుడు వచ్చే రెండు త్రైమాసికాలు తమకు గడ్డుకాలం పరిస్థితి అని టీసీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సంస్థలో పని చేసే 4.5 లక్షల ఉద్యోగులను ఎవరినీ తొలగించమని స్పష్టం చేసింది. అయితే దీనితో పాటు జీతాలు (ఇంక్రిమెంట్) కూడా పెంచమని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఉద్యోగాలకు నియమించుకున్న40 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇస్తున్నట్లు.. వారందరినీ చేర్చుకుంటామని తెలిపింది.