సీఎం జగన్ నిర్ణయం పై టీడీపీ రియాక్షన్ ఇది!

Update: 2019-06-07 13:12 GMT
తన కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని ప్రకటించి సంచలనం రేపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి  అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి అలాంటి ప్రకటన  ఏదీ చేయలేదు. అలాంటి హామీనే ఇవ్వలేదు.

ఒకవేళ జగన్ కేబినెట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా దక్కినా అది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అవి కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే. అయితే  అనూహ్యంగా జగన్ మోహన్  రెడ్డి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ప్రతిపాదించారు.

అది కూడా విభిన్న సామాజికవర్గాల వారికి ఆ అవకాశం ఇవ్వనున్నట్టుగా జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చ సాగుతూ ఉంది.ఈ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశం మీద స్పందించింది.  అది వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్  మోహన్  రెడ్డి ఇష్టం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ  రియాక్ట్ అయ్యింది.

‘కేబినెట్  ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రికి పూర్తి స్వతంత్రం ఉంటుంది. కాబట్టి వారికి  ఇష్టం వచ్చినట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు..’ అని తెలుగుదేశం పార్టీ వాళ్లు ముక్తసరిగా స్పందించారు.

Tags:    

Similar News