జగనన్న అధికారంలోకి వచ్చి మూడేళ్లయి నాలుగో వసంతంలోకి అడుగుపెట్టారు. కొన్ని ప్రజలకు నచ్చే పనులు, ప్రజలకు పంచే పనులు చేసినా... భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేయలేదన్నది ప్రధనా విమర్శ. సంక్షేమం పేరిట కొన్ని చోట్ల అనవసర వృథా చేస్తున్నారు అన్న విమర్శలను జగన్ లెక్క చేయడం లేదు.
సంక్షేమమే అభివృద్ధి అని, వికాసం అని జగన్ నమ్ముతున్నారు. అదే మాట ప్లీనరీలో కూడా చెప్పారు. ఇకపై మరింత బాగా పనిచేసేందుకు ప్లీనరీకి వచ్చిన స్పందన ఉపయోగపడుతుందన్నారు. అమ్మనాన్న ఆశీస్సులతో బాగా పనిచేస్తానని అంటూనే, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే టీడీపీ మాత్రం జగనన్న పాలనపై ఓ రేంజ్ కౌంటర్లు వేస్తోంది. జగనన్న పాలనకు సంబంధించి ఏ నుంచి జెడ్ వరకూ ఏ విధంగా ఉంది అన్నది చెప్పేందుకు ప్రయత్నిస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే జగన్ ను టీడీపీ టీజింగ్ చేస్తున్నది. ఏ అంటే అమ్మ రాజీనామా, బీ అంటే బాబాయ్ హత్య, సీ అంటే చెల్లెల్లికి వెన్నుపోటు, డీ అంటే దిశా లేని దిశ, ఈ అంటే ఎంప్లాయ్మెంట్ లేని రాష్ట్రం అంటూ ర్యాగింగ్ చేస్తోంది.
ఇదే విధంగా జెడ్ వరకూ వివిధ అల్ఫాబెట్స్ తనదైన శైలిలో మాటలు వల్లెవేస్తుంది. అబ్రివేషన్లు రాస్తూ వస్తున్నది. అయితే వీటికి సంబంధించి వైసీపీ కౌంటర్లు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి.
తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయిందని, 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో చేయని పనులు తాము చేశామని అంటోంది. సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అందరూ సమానంగా పొందేందుకు పీఠికలో రాసుకున్నాం అని, రాజ్యాంగాన్ని గౌరవించే మన పార్టీ అని గర్వంగా చెప్పవచ్చు అని అంటోంది వైసీపీ. సంక్షేమం అభివృద్ధి కాదని ఎలా అనుకుంటున్నారు.. ఈవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వచ్చి మాట్లాడగలవా ? " అని ప్రశ్నిస్తోంది వైసీపీ.