రోజా అడుగుపెడితే రచ్చరచ్చే

Update: 2016-01-11 10:13 GMT
నగరి ఎమ్మెల్యే, వైసీపీ మగరాయుడు రోజా తన నోటి దురుసుతనంతో సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న ఆమె తాజాగా మరోసారి నోరు జారడంతో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలు - కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ జిల్లా చింతలపూడిలో పర్యటించేందుకు వెళ్లిన ఆమెను టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. చింతలపూడి మండలంలోని ధర్మాజీగూడెంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సోమవారం ఆమె వెళ్లగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దళిత మంత్రిని - దళిత ఎమ్మెల్యను అవమానించిన రోజా క్షమాపణచెప్పాలని టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. రాస్తారోకో చేశారు. ''రోజా గో బ్యాక్'' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు.

ధర్మాజిగూడెంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంబోత్సవానికి పార్టీ నేతలు విజయసాయిరెడ్డి - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - ఆదిరెడ్డి అప్పారావు -కొత్తపల్లి సుబ్బారాయుడు -గంటా మురళీ ప్రభృతులతో కలిసి రోజా అక్కడకు వెళ్లారు. ఈ సంద్భంగా ఆమె మంత్రి కి వడ్డాణాలపై ఉన్న మోజు ప్రజలకు సేవ చేయడం లో లేదని విమర్శించారు. చంద్రబాబుకు భజన చేయడం తప్ప ఆమె కు వేరే పని లేదంటూ పీతలసుజాతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  దీంతో టీడీపీ శ్రేణులు మండిపడి ఆమెను అడ్డుకున్నాయి. దాంతో వైసీపీ నేతలూ వచ్చి వారితో గొడవకు దిగారు. రెండు వర్గాలూ వాదులాడుకుంటూ ఘర్షణలకు దిగడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి రెండు వర్గాలనూ చెదరగొట్టారు. రోజా ఎక్కడ అడుగుపెడితే అక్కడ గొడవలేనని జనం అనుకుంటున్నారు.
Full View

Tags:    

Similar News