రాయలసీమ అంటేనే జగన్ కి అడ్డా అని అంతా అంటారు. దానికి తగినట్లుగా జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 2019లో సీఎం అయ్యేదాకా సీఎంలోని నాలుగు జిల్లాలూ వైసీపీకి పెట్టని కోటగా ఉంటూ కాపు కాశాయి. 2014లో సైతం ఒక్క అనంతపురం జిల్లా తప్ప మిగిలిన మూడింటా వైసీపీ ఫ్యాన్ గిర్రున తిరిగింది. 2019 ఎన్నికల్లో చూస్తే ఎకంగా 52 సీట్లకు గానూ 49 సెట్లను గెలుచుకుని వైసీపీ తిరుగులేని రికార్డుని సొంతం చేసుకుంది.
అయితే చంద్రబాబు జగన్ ఇద్దరూ సీమ బిడ్డలైనా బాబు చేయలేని పని జగన్ చేస్తారని సీమను అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో నడుతారని ఎంతో ఆశతో నూటికి నూరు శాతం ఓట్లను జనాలు గుద్దేశారు. కానీ జగన్ మాత్రం గత నాలుగేళ్ల పాలనలో వారి ఆశలను వమ్ము చేశారు అని అంటున్నారు.
అదేలా అంటే సీమకు సంబంధించి విభజన హామీలు ఏవీ నెరవేరలేదు. కొత్తగా పరిశ్రమలు లేవు సరికదా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయి. ఇంకో వైపు చూస్తే కడప ఉక్కు పరిశ్రమకు దిక్కు లేదు. ఇక రోడ్ల పరిస్థితి అద్వాన్నం, సాగునీటి ప్రాజెక్టుల గురించి మరచిపోవడమే బెటర్. ఉపాధి లేదు. ప్రజలకు బతికేందుకు దారి తెన్నూ లేదు.
ఇలా జగన్ సర్కార్ సీమకు అన్ని విధాలుగా అన్యాయమే చేసింది అని అంటున్నారు. వీటికి తోడు అన్నట్లుగా సీమ ప్రజల చిరకాల కోరిక అయిన రాజధాని విషయంలోనూ వైసీపీ వేరేగా వ్యవహరించింది అని అంటున్నారు. సీమకు రాజధాని కావాలని ఉంది. కానీ అమరావతిని చంద్రబాబు పెట్టారు. పోనీ అలా ఉంది అనుకుంటే ఇపుడు దాన్ని విశాఖకు తరలిస్తామని జగన్ అంటున్నారు. సీమకు హై కోర్టు ఇస్తామని చెబుతున్నారు.
కానీ అది అయ్యే పని కాదని తేలిపోయింది. పైగా సుప్రీంకోర్టులో అమరావతి కేసు సందర్భంగా హై కోర్టు అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం పక్షాన న్యాయవాదులు చెప్పారు. లేటెస్ట్ గా ఏపీ జ్యుడీషియల్ అకాడమిని కూడా ఏర్పాటు చేశారు. క్రిష్ణా రివర్ బోర్డ్ ని హైదరాబాద్ నుంచి తరలించి విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సీమ వాసులకు కోపంగానే ఉన్నాయి.
అభివృద్ధి లేమి పాలనాపరమైన వైఫల్యాలు అన్నీ కూడా సీమ వాసులలో కొత్త ఆలోచనలు కలుగచేస్తుననయి అని అంటున్నారు. ఇక సామాజిక సమీకరణలు చూస్తే బలిజలు తెలుగుదేశం వైసీపీ మధ్య తిరుగుతూ ఉన్నారు. కానీ ఇపుడు జనసేన తో తెలుగుదేశం పొత్తు కనుక కుదిరితే టోటల్ ఓట్లు ఒక వైపు గా మళ్ళుతాయని అంటున్నారు. దాని వల్ల జగన్ సొంత జిల్లా కడపలోనే అయిదారు నియోజకవర్గాలలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది అని అంటున్నారు.
మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, జమ్మలమడుగు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన తెలుగుదేశం పొత్తు దెబ్బ వైసీపీ మీద గట్టిగా పడనుంది అని అంటున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో తెలుగుదేశానికి బలం ఉంది. ఇపుడు జనసేన తోడు అయితే పద్నాలుగు సీట్లలో సగానికి పైగా ఈ కూటమికే మొగ్గు ఉంటుందని అంటున్నారు.
అదే పరిస్థితి చిత్తూరు జిల్లాలో కూడా కనిపిస్తుంది అని అంటున్నారు. కర్నూల్ జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల అంటే 38 సీట్లలో సగానికి సగం ఈ కూటమి కైవశం చేసుకున్నా ఏపీలో వైసీపీకి అధికారం మరోసారి కష్టమే అన్న విశ్లేషణ అయితే ఉంది. మరి దీనికి విరుగుడు మంత్రం వైసీపీ వద్ద ఏమి ఉందో చూడాలని అంటున్నారు.