ప్రశ్న : జై అమ‌రావ‌తి అంటే ఏమౌతుంది జగ‌న్ !

Update: 2022-06-04 12:34 GMT
సంప‌ద సృష్టికి ప్రాధాన్యం ఇస్తే ఉపాధి మార్గాలు పెరుగాతాయ‌ని భావించి, కొంత భూమిని సేక‌రించి, కొంత భూమిని స‌మీక‌రించి ఆర్థిక ప్ర‌గ‌తి అన్న‌ది ధ్యేయంగా ఆ రోజు క్యాపిట‌ల్ సిటీ కాన్సెప్ట్ ను చంద్ర‌బాబు డెవ‌ల‌ప్ చేశార‌ని, కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయాయి అని టీడీపీ అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. ముఖ్యంగా ప్ర‌యివేటు భూమి సేక‌ర‌ణ చాలా త‌ల‌నొప్పిగా ఉన్న ఆ రోజుల్లోనే కేవ‌లం ప్ర‌భుత్వంపై ఉన్న న‌మ్మ‌కం కార‌ణంగా భూములు ఇచ్చామ‌ని, ప‌చ్చ‌ని పొలాలు ఇప్పుడు ఎందుకూ అక్క‌ర‌కు రాకుండా పోయాయ‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు.

అయితే అమ‌రావ‌తి అభివృద్ధి కార‌ణంగా నిధులు, నియామ‌కాలు వ‌స్తాయ‌ని భావించిన టీడీపీ త‌రువాత కాలంలో అధికారం పోగొట్టుకోవ‌డంతో జ‌గ‌న్  వ‌చ్చాక కొంద‌రి స‌ల‌హాలు ప‌నిచేసి 3 రాజ‌ధానుల నియ‌మం అందుకున్నారు. ఆ కార‌ణంగా చాలా చోట్ల భూముల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. క్యాపిట‌ల్ సిటీ అనే కాన్సెప్ట్ అస్స‌లు లేకుండా పోయింది. కోట్లు వెచ్చించి కొన్ని భ‌వ‌నాలు నిర్మిస్తే అవి కూడా  అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు జ‌గ‌న్ ఆ రోజు  నుంచి ఈ రోజు వ‌ర‌కూ అస్స‌లు సుముఖంగా లేరు అని టీడీపీ వాపోతోంది. ఇన్ని జ‌రిగినా క్యాపిట‌ల్ సిటీని ఒక బ్రాండ్ గా చూపిస్తూ.. కొంత‌లో కొంత పెట్టుబ‌డులు ఆక‌ర్షించే బ్రాండ్ అమ‌రావ‌తి ఇమేజ్ పూర్తిగా నాశ‌నం చేశార‌ని టీడీపీ బాధ‌ప‌డుతోంది.

ఓ విధంగా తాము సృష్టించిన ల‌క్ష కోట్ల సంప‌ద ఏమ‌యింది అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ. అమ‌రావ‌తిని ఉద్దేశించి టీడీపీ సంధిస్తున్న ప్ర‌శ్నాస్త్రాల‌కు స‌మాధానాలే లేకుండా పోతున్నాయి. మ‌రోవైపు లే ఔట్ల పేరిట కొంత వ్యాపారం చేయాల‌ని భావించి జ‌గ‌న‌న్న స్టార్మ్ టౌన్ షిప్ ల‌కు డిజైన్ చేశారు.

అంటే అమ‌రావ‌తిలో ప్లాట్లు వేయ‌కుండా మిగిలి ఉన్న భూమిని చ‌ద‌ర‌పు గ‌జం 17,800 రూపాయ‌ల చొప్పున విక్ర‌యించేందుకు ఆ విధంగా ఖ‌జానాకు ఆర్థిక ప్ర‌యోజ‌నం ద‌క్కించేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 528 స్థలాల‌ను ఎంపిక చేసి అమ్మ‌కానికి ఉంచితే అందులో 149 మంది మాత్ర‌మే డౌన్ పేమెంట్ చెల్లించార‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఒక‌నాడు చ‌ద‌ర‌పు గ‌జం 25 నుంచి 30 వేల రూపాయ‌లు ప‌లికింద‌ని, త‌రువాత 39 వేల వ‌ర‌కూ ప‌లికింద‌ని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డి చేస్తున్నాయి. కానీ ఇప్పుడు అక్క‌డ రియ‌ల్ బూమ్ అన్న‌ది లేకుండానే పోయింద‌ని టీడీపీ వాపోతోంది.

ఇక క్యాపిట‌ల్ వెంచ‌ర్ పేరిట చంద్ర‌బాబు కొన్ని నిర్మాణాలు చేప‌ట్టారు. వాటికి సంబంధించి కూడా జ‌గ‌న్ ఎటువంటి పురోగ‌తీ చూప‌లేక‌పోయారు. అమ‌రావ‌తిలో కొంత భూమిని అభివృద్ధి చేసి ఉంటే, చాలా మందికి అదొక ఉపాధి మార్గం అయి ఉండేద‌ని చెబుతున్నారు  ఇక్క‌డి రైతులు.

కానీ భూములు  తీసుకున్నాక వాటిని మ‌ళ్లీ సాగుకు యోగ్యంగా మ‌ల‌చ‌డం త‌మ వ‌ల్ల కాద‌ని కూడా వీళ్లంతా చేతులెత్తేస్తున్నారు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు సీఆర్డీఏ పేరిట కొంత లాబీయింగ్ న‌డిపి బ్యాంకుల ద‌గ్గర నుంచి అప్పులు తెచ్చుకోవ‌డం చేయ‌డం త‌ప్ప కొత్త‌గా అక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టిన కార‌ణంగా తాము ఆ రోజు సృష్టించిన సంపద విలువ ల‌క్ష కోట్లు ఎందుకూ కొర‌గాకుండా పోయింద‌ని వాపోతోంది టీడీపీ.
Tags:    

Similar News