టీడీపీ-బీజేపీ దోస్తీ క‌లేనా?

Update: 2016-12-18 17:30 GMT
ఏపీలో పెండింగ్‌ లో ఉన్న మున్సిపల్‌ -కార్పొరేషన్‌ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న తరుణంలో సహజంగానే ఈ ఎన్నికలు అధికార టీడీపీకి పెద్ద సవాల్‌గానే చెప్పవచ్చు. అయితే అంత‌కంటే పెద్ద స‌వాల్ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నుంచి ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల బీజేపీ నేత‌లు చేస్తున్న కామెంట్లు, విసురుతున్న స‌వాల్లు చూస్తుంటే ఈ అభిప్రాయం క‌లుగుతోంద‌ని చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నరేళ్ల అనంతరం ఈ ఎన్నికలకు మార్గం సుగుమమైంది. ఈ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు ప్రభావితం చేసినా కార్పోరేషన్‌ - మున్సిపల్‌ ఎన్నికలు అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు ఉంటారు కాబట్టి సహజంగానే ప్రభుత్వ పాలన ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో చూపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతోపాటు ఈ ఎన్నికలు మరీ ముఖ్యంగా అధికార పార్టీ లకు మాత్రం పెద్ద సవాలేనని అంటున్నారు. అయితే ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా, పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో పొడ‌చూపిన అంశాలతో టీడీపీ-బీజేపీల మధ్య అంతర్గతంగా కొంత దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో టీడీపీ-బీజేపీ పాలుపంచుకొన్న ఏపీలోని కొన్ని జిల్లాలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సందర్భం వచ్చినప్పుడుల్లా బీజేపీ నేత - ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధికార టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే రీతిలో సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు - సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వివ‌ర్శిస్తున్నారు. మంత్రి మాణిక్యాల రావుకు స్థానిక టీడీపీ నేత‌ల‌కు స‌రిపోల‌డం లేదు.  కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ అన్ని డివిజన్లలో ఒంటరిగా పోటీచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే తమ సత్తా ఏమిటో చాటుతామని టీడీపీకి మీడియా ముఖంగా ఆయన సవాల్‌ విసిరారు. ఇలాంటి పరిస్థితులే ఏపీలో పెండింగ్‌ కార్పోరేషన్‌ ఎన్నికలు జరిగే పలు చోట్ల ఉన్నాయంటున్నారు. మరికొన్ని జిల్లాలలో టీడీపీ- బీజేపీ మధ్య ఇలాంటి సన్నివేశాలే కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ‌తాయ‌నే సందేహం క‌లుగుతోంది. ఒక వేళ టీడీపీని కాదని బీజేపీ ఒంటరిగా వెళ్లితో త్వరలో జరిగే ఈ పెండింగ్‌ కార్పోరేషన్లలో మెజార్టీ స్థానాలు ఎన్ని అనే ప్ర‌శ్న‌ను తెలుగుత‌మ్ముళ్లు వ్య‌క్తం చేస్తున్నారు.

మొత్తుంగా రెండు పార్టీలు ఇటు మితృత్వాన్ని కొన‌సాగిస్తూనే అటు విమ‌ర్శ‌లు సైతం చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధాన్ని రాబోయే కార్పొరేష‌న్ తేల్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలు టీడీపీ-బీజేపీలకు ఇరువురికి ప్రతిష్టాత్మక‌మేనని ఆ పార్టీలు ధృవీకరిస్తున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీకి ఇంకా ప్రతిష్టాత్మకం అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో అధికా రంలోను న్నది టీడీపీనే కాబట్టి ఈ ఎన్నికలు ఆపార్టీకే కీలకం అవుతాయని వారు అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News