ఉత్తరాంధ్రలో బలమైన వెలమ వర్గానికి చెందిన ఓ నేత కోసం బీజేపీ - టీడీపీలు రెండూ పోటీ పడుతున్నాయి. గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో వెలమ నేత కోసం అన్వేషిస్తున్న రెండు పార్టీలూ ఒకే నేత కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి ధర్మాన సోదరులు... టీడీపీలో అయ్యన్న - అచ్చెన్నాయుడు వంటి వెలమ నేతలు ఉన్నారు. అయినా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల నాటికి మరో బలమైన వెలమ నేత కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా అనకాపల్లి మాజీ ఎంపి - విశాఖ మాజీ మేయర్ సబ్బం హరిని తమ పార్టీల్లో చేర్చుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ కూడా బలంగా ప్రయత్నిస్తుండడంతో రెండు పార్టీల మధ్య అక్కడ చిచ్చు రేగుతోంది.
విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను టిడిపి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంచి ఇమేజ్ - వివాద రహిత నేపథ్యం ఉన్న హరి తమ పార్టీలో చేరితే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగు ఉండదని టిడిపి నాయకత్వం భావిస్తోంది. హరి మేయర్‌గా పనిచేసిన కాలం కంటే ఇప్పుడు కార్పొరేషన్ పరిథి పెరగడం - వెలమ సామాజికవర్గంలో పట్టు ఉండటంతో మేయర్ అభ్యర్ధిగా సబ్బం సరైన నాయకుడిగా అంచనా వేస్తోంది. అందులో భాగంగా ఆయనను తమ పార్టీలో చేరాలని సబ్బం హరి సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవలి విధానమండలి ఎన్నికల ముందు కూడా, పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. సబ్బం హరి పార్టీలో చేరితే విశాఖ కార్పొరేషన్ పరిథిలో పాటు - ఉత్తరాంధ్రలో బలమైన వెలమ సామాజికవర్గం కూడా పార్టీ వైపు మళ్లుతుందన్న అంచనా టిడిపి నాయకత్వంలో ఉంది.
బిజెపి కూడా ఇదే అంచనాతో సబ్బం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. సబ్బం హరితోపాటు - మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కూడా పార్టీలో చేర్చుకుంటే ఉత్తరాంధ్రలో వెలమ - గవర కులాలను ఆకట్టుకోవచ్చన్న యోచనతో ఉంది. ఇప్పటికే బిజెపి ప్రముఖులు ఆయన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. పార్టీ అధినేత అమిత్ షా ఆదేశాల మేరకు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులను బిజెపిలో చేర్చుకునే వ్యవహారానికి నాయకత్వం పదునుపెట్టింది. పైగా విశాఖలో ఒక ఎంపి - ఒక ఎమ్మెల్యే బలం ఉన్నందున సబ్బం హరి కూడా చేరితే విశాఖ జిల్లాలో పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్న అంచనా ఉంది. సబ్బం వంటి ఉన్నత విలువలు, సిద్ధాంతాలున్న నేత పార్టీలో చేరితే, తటస్థులు కూడా పార్టీలో చేరతారన్న అంచనాతో ఉంది. టిడిపి - బిజెపికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడారు. మరోవైపు సబ్బం హరి ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేక డోలాయమానంలో ఉన్నారట. ఆఫర్లు ఎక్కువవడంతో కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెబుతున్నారు.