సాధారణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్దరు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశపడుతున్నవారు సహజంగానే పెరు గుతున్నారు. ఇక, వచ్చే 2024 ఎన్నికలు ఏపీలో మరింత ఉత్కంఠకు దారితీస్తుండడంతో ఆశావహుల సంఖ్య మరింత పెరుగుతోంది. వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని.. పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.దీంతో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు పెరుగుతున్నారు.
అదేసమయంలో ఈసారి చాన్స్ చంద్రబాబుకేనని.. వైసీపీ పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని.. టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో ఇటు టీడీపీలో నూ ఆశావహుల జాబితా పెరుగుతోంది. అయితే.. ఎక్కడై నా .. ఒక సీటుకు ఒకరు లేదా.. ఇద్దరు చొప్పున పోటీ ఉంటే.. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం ఒక సీటుకు ఇద్దరి నుంచి ముగ్గురు, నలుగురు కూడా పోటీలో ఉండడం గమనార్హం. 2014 సహా గత 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ విజయం దక్కించుకుంది.
ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న మద్దాలి గిరి.. వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో ఇప్పుడు టీడీపీకి ప్రాతినిధ్యం కరువైంది. అయితే..వచ్చే ఎన్నికల్లోపోటీ చేసేందుకు మాత్రం ఒకరు కాదు..ఏకంగా.. నలుగురు పోటీలో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్‌గా కోవెలమూడి రవీంద్ర(నాని) ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ కావాలని ఆయన కోరుతున్నారు. అయితే.. దీనిపై బాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు.. ఇదే టికెట్ కోసం మన్నవ మోహన్ కృష్ణ, భాష్యం ప్రవీణ్ కూడా.. ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిముషంలో ఎవరు వస్తారో తెలియదు. ఇదిలావుంటే.. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు ఉంటే కనుక.. దీనిలో భాగంగా తెనాలి స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. నాదెండ్ల మనోహర్ అక్కడ నుంచే పోటీ చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి పోటీ చేసే టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. అయితే.. ఇక్కడ ఎవరు పోటీ చేసినా.. టీడీపీకి ఉన్న బలం.. బలగం నేపథ్యంలో వరుస విజయాలు సాధించిన హిస్టరీ ఉన్న క్రమంలో వారే గెలుపుగుర్రం ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది.
ఇక, అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే.. గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన.. లేళ్ల అప్పిరెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నుంచి వచ్చిన మద్దాలి గిరికే వైసీపీ టికెట్ దక్కనుందని అంటున్నారు. గత ఎన్నికల్లో గిరిమీద ఓటమి పాలైన చంద్రగిరి ఏసురత్నం మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా ఉన్నారు. సో.. ఆయనకు కూడా ఈ దఫా టికెట్ దక్కే అవకాశం లేదు. మొత్తంగా చూస్తే.. వైసీపీ నుంచి క్లారిటీ ఉన్నా.. టీడీపీలో మాత్రం పోటీ ఎక్కువగా ఉండడం గమనార్హం