ఏపీ ఎన్నికల వేళ రణరంగం కొనసాగుతోంది. ఏపీలోని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరస్పరం దాడుల వరకు పరిస్థితి వెళ్లింది.
గుంటూరు జిల్లా సత్తెన పల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో టీడీపీ - వైసీపీ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సత్తెనపల్లి నుంచి టీడీపీ తరుఫున పోటీచేస్తున్న శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు గ్రామంలోకి రెచ్చగొట్టే విధంగా రాగా ఘర్షణ తలెత్తింది. వైసీపీ నాయకులను రెచ్చగొట్టారు. దీంతో గొడవ తలెత్తింది. ఈ గొడవలో స్పీకర్ కోడెల చొక్కా చినిగిపోయింది.
ఇక ఈ ఘర్షణలో స్పీకర్ కోడెల గన్ మెన్లు గాల్లోకి కాల్పులకు తెగబడేందుకు ప్రయత్నించగా ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కోడెల గన్ మెన్లను తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ - వైసీపీ నేతల ఘర్షణ నేపథ్యంలో కోడెల గాయపడినట్లు తెలిసింది.