ఒక్క ఓటుతో ఓడినా ఓడినట్టే.. అందుకే ఈ ఎన్నికల వేళ.. ఒక్కో ఓటు ఎంతో విలువైంది.. పోయినసారి ఓడిపోయి పాఠాలు నేర్చుకున్న పార్టీలు ఈసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఏపీలో గత సారి పదులు - వందలు - వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ఇప్పుడు టీడీపీ - వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
టీడీపీ - వైసీపీలు ఇప్పుడు పోయినచోటే వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. 5000 ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ఈ ఎన్నికల్లో స్పెషల్ ఫోకస్ పెట్టాయట ఇరు పార్టీలు. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి.
2014లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ ఓడిపోయింది. కానీ 5వేల ఓట్ల స్వల్ప తేడాతో చాలా నియోజకవర్గాల్లో ఇరుపార్టీలు ఓడిపోయాయి. అక్కడ కొంచెం ఫోకస్ పెట్టినా రాష్ట్రంలో పరిస్థితి తారుమారుగా ఉండేది. ఇప్పుడు ఆ స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన స్థానాలపై వైసీపీ - టీడీపీలు ప్రధానంగా దృష్టిసారించాయి.
గత 2014 ఎన్నికల్లో 5వేల ఓట్ల తేడాతో 29 నియోజకవర్గాలను చేజార్చుకుంది టీడీపీ.. అలాగే ఇదే 5వేల ఓట్ల తేడాతో 16 సీట్లలో వైసీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గెలవడానికి రెండు పార్టీలు స్కెచ్ గీస్తున్నాయి.
గత ఎన్నికల్లో మంగళగిరిలో కేవలం 12 ఓట్ల తేడాతోనే వైసీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది. అక్కడ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ చంద్రబాబుపై వరుస కేసులు వేసి బెంబేలెత్తించాడు. అందుకే ఇప్పుడు బాబు ఏకంగా లోకేష్ ను దించి ఆళ్ల రామకృష్ణను ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు. ఇక ఉరవకొండలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కేవలం 2275 ఓట్ల తేడాతో వైసీపీ చేతిలో ఓడిపోయారు.
ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గెలుపు గ్యారెంటీ అనుకుంటే కేవలం 924 ఓట్ల తేడాతో సత్తెనపల్లిలో ఓడిపోయి అవమానపడ్డారు. జగ్గయ్యపేటలో 1350ఓట్ల తేడాతోనే వైసీపీ నేత సామినేని ఉదయభాను ఓడిపోయారు. ఇలా మొత్తం 16 స్థానాల్లో వైసీపీ 5వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది.
దీంతో ఇప్పుడు రెండు పార్టీలు ఇలా తక్కువ ఓట్లతో ఓడిపోయిన స్థానాల్లో పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టాయట.. ఈసారి ప్రతీ సీటు కీలకమే.. ప్రతీ ఓటు ప్రతిష్టాత్మకమే.. అందుకే ఇప్పుడు టీడీపీ - వైసీపీ రెండు పార్టీలు పొగొట్టుకున్న చోటే వెతికే పనిలో బిజీగా ఉన్నాయట.. మధ్యలో జనసేన మూడో పోటీదారుగా రావడంతో ఈసారి వెయ్యి రెండు వేల ఓట్ల తేడాతోనే ఏ అభ్యర్థి అయినా ఓట్లు చీలి గెలుపొందుతాడు. అందుకే ఇరు పార్టీలు ఇప్పుడు స్వల్ప మెజార్టీ వచ్చిన స్థానాలపై ఫుల్ ఫోకస్ చేశాయట..