వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు ఒక ప్రచారం చేస్తున్నారు. జగ న్ ఒక నిరంకుశ వాది అని.. తను చెప్పిందే వినాలనే టైపని.. ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పరాద ని.. ఆయన చెప్పిందే చేయాలని.. ఇలా.. అనేక రూపాల్లో ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగుల నుంచి కింది స్థాయి సిబ్బందికి..జగన్ అంటే హడల్ అని.. కూడా ప్రచారం ఉంది. ఇక, మంత్రులు కూడా ఎవరూ జగన్ దగ్గర నోరు మెదిపే ప్రయత్నం చేయరని.. ఆయన చెప్పింది విని.. జేజేలు కొట్టి బయటకు వచ్చేయడం తప్ప.. ఆయనకు సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయరని.. టీడీపీ నేతలు చెబుతుంటారు.
అంతేకాదు.. రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగ సంఘాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై నోరు విప్పే ప్రయత్నం చేయ డం లేదని.. తమకు సంబంధించిన సమస్యలు అలా పెండింగులోనే ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనికి కారణం.. జగన్ అంటే వీరికీ చచ్చేంత భయమని.. అందుకే.. మౌనంగా ఉంటున్నారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. అదేసమయంలో గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు.. నిత్యం ఉద్యోగ సంఘాలు ఏదో ఒక సమస్యతో చెవిలో రొద పెట్టేవారని.. సదరు సమస్యను పరిష్కరించే వరకు.. కూడా.. పట్టుబట్టేవార ని.. ఇప్పుడు మాత్రం జగన్ దెబ్బతో మౌనంగా ఉంటున్నారని.. టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మరి ఇది నిజమేనా? సీఎం జగన్ అంటే.. వారికి చచ్చేంత హడలేనా? లేక ఇది రాజకీయ ప్రచారమా? ఇదీ.. తాజాగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహా లు సూచనలు ఇచ్చేందుకు మాజీ ఉద్యోగిని తాజాగా జగన్ ప్రభుత్వం నియమించుకుంది. ఈ నేపథ్యంలో మరి ఉద్యోగులను చీదరించుకునే జగన్.. వీరిని ఎలా .. తన దగ్గర పెట్టుకున్నారనేది ప్రధాన అంశం. అంతేకాదు.. ఉద్యోగులు ఎవరూ కూడా జగన్ తమను విమర్శించారని కానీ.. తమకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదని కానీ.. చెప్పడం లేదు. అంతేకాదు.. జగన్ విషయంలో సానుకూలంగానే మాట్లాడుతున్నారు.
ఇక, మంత్రి వర్గం విషయానికి వచ్చినా.. ప్రతి మంత్రులు రిపోర్టులు ఇస్తున్నారు. వారి రిపోర్టులను జగన్ పరిశీలిస్తున్నారు. ఏ ఒక్కరూ అసంతృప్తిగా లేరు. అంతేకాదు.. జగన్‌కు ప్రతి ఒక్కరూ గౌరవంగానే ఉంటున్నారు. ఇక, ఉద్యోగులు కూడా ఇటీవల జగన్‌ను కలిసినప్పుడు.. తమ సమస్యలను ఎంతో సమయం వెచ్చించి విన్నారని.. వాటిని పరిష్కరించేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని .. చెప్పుకొచ్చారు. అంతే తప్ప.. టీడీపీ నేతలు చెప్పినట్టు లేదా ప్రచారం చేసినట్టు.. జగన్ ఎక్కడా నిరంకుశంగా ఉన్నట్టు కనిపించడం లేదని అంటున్నారు నెటిజన్లు. సో.. ఇదీ విషయం.