ఎన్ని సమీక్షలు పెడితే మాత్రం.. ఇప్పుడు ఎంత గింజుకుంటే మాత్రం.. ఈవీఎంలో ఓట్లు మారతాయా..' అని అంటున్నారట తెలుగుదేశం నేతలు. ఇందులో వ్యంగ్యం ఉన్నా ఆ మాటలు అయితే వాస్తవంగానే ఉన్నాయని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుతో విసిగిపోయి ఆ పార్టీ నేతలు ఈ మాటలు అంటూ ఉన్నారట.
చంద్రబాబు నాయుడు వరసగా సమీక్షలు పెడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ నేతలతో బాబు వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఒకేసారి సమీక్ష అని అన్నారు. అంత వరకూ పార్టీ వాళ్లు ఓర్చుకున్నారు. అయినా ఆ సమీక్షతో కూడా ఒరిగేది ఏమీ లేదు.
'ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. అలాంటప్పుడు ఏ సమీక్ష నిర్వహించి ఏం ప్రయోజనం?' అనేది తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన ప్రశ్న. ఏదో ఒకసారి సమీక్ష అంటే అదో రకం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వరసగా టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూనే ఉన్నారు!
ఆ టెలీకాన్ఫరెన్స్ లలో చెప్పిందే చెబుతూ ఉన్నారు. పార్టీ గెలుస్తుందని డప్పు కొడుతూ ఉన్నారు. అదీ చాలదన్నట్టుగా మళ్లీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలట. మళ్లీ పాత కథే. పోలింగ్ బూత్ ల వారీగా రిపోర్టులు కావాలంటూ చంద్రబాబు పార్టీ నేతల మీద ఒత్తిడి తెస్తున్నారట. అయినా వీటితో ఇప్పుడు సాధించేది ఏమిటో ఆయనకే తెలియాలని తెలుగుదేశం నేతలు వాపోతూ ఉన్నారు.
'పోలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సమీక్షలు నిర్వహిస్తే మాత్రం ఈవీఎంలలో ఓట్లు మారతాయా..' అని కొందరు తెలుగుదేశం నేతలు గొణుక్కొంటూ ఉన్నారు. అయితే బాబు మాత్రం తన తీరును మార్చుకోవడం లేదని వాపోతున్నారు!