ఏపీ రాజకీయాల్లో కీలకమైన చర్చతెరమీదికి వచ్చింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతలు కొందరు తమ తమ నియోజకవర్గాల్లో చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? అనే విషయంపై చర్చ చేస్తు న్నారు. నిజానికి ఈ చర్చ కొన్నాళ్లుగా టీడీపీ చేస్తున్నా.. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండ డంతో మరింత వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే నాయకులు కదులుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడు అవసరమనే విధంగా టీడీపీ నేత లను ప్రజలను మౌల్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయిందని, ఎక్కడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా దక్కడం లేదని వారు చెబుతున్నారు. వీటిని వింటున్న స్థానికులు ఔననే తలలూపుతున్నారు. నిజంగానే ఏపీ అభివృద్ధి నిలిచిపోయిందని అంటున్నారు.
ఇక చంద్రబాబు బయట ప్రాంతాల వారీ పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా జనాల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. ఎక్కడికక్కడ తండోప తండాలుగా జనాలు వస్తున్నారు. ఇవన్నీ టీడీపీ నేతల్లో ఆశలు పెంచేలా చేస్తున్నాయి. అదే సమయంలో అందరూ కడుతున్న పన్నులను కొందరికి ఉచిత పథకాల పేరుతో ఇవ్వడాన్ని మధ్య తరగతి వర్గం ప్రజలు తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో కొండపి, పరుచూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు చేస్తున్న చర్చలు ప్రజల్లోకి బాగానే వెళ్తున్నాయి. అయితే, వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ద్వారా.. ప్రజలను మరింతగా ఆలోచన చేసేలా వ్యూహం సిద్ధం చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. మరి చంద్రబాబు ఏంచేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.