బాబు జోరు త‌గ్గ‌లేదు.. నేత‌లదే డౌట్‌.. !

Update: 2022-06-21 02:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు జోరు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి జోరు ఉందో.. ఇప్పుడు కూడా అదే జోరు క‌నిపిస్తోంది. ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఎక్క‌డికి వెళ్లినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడు నుంచి.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల వ‌ర‌కు ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. జోరుగా త‌ర‌లి వ‌స్తున్నారు.

తాజాగా విజ‌యన‌గ‌రం, శ్రీకాకుళం.. జిల్లాల్లో జ‌రిగిన స‌భ‌లు.. రోడ్ షోల‌ను గ‌మ‌నిస్తే.. ఇదే వాస్త‌వం క‌ళ్ల‌కు క‌డుతోంది. నిజానికి ఈ జోరు ఇప్పుడు కొత్త‌కాదు.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా చంద్ర‌బాబు ఇలాంటి ప‌రిస్థితే ఉంది.

అప్ప‌ట్లో మ‌హిళ‌లు, యువ‌కులు.. ఎంతో మంది చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌ను.. ప్ర‌చారాన్ని సక్సెస్ చేశారు. అయితే.. ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం నాయ‌కుల‌కు వేయ‌లేదు. దీంతో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో వైసీపీ విజ‌యం సాధించింది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చంద్ర‌బాబు విష‌యంలో మార‌లేదు. కానీ, నాయ‌కుల విష‌యంలోనే టీడీపీ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను తీసుకుంటే..చంద్ర‌బాబు త‌న‌ను తాను టెస్ట్ చేసుకుంటున్నారే.. త‌ప్ప‌.. పార్టీ నాయ‌కుల‌ను టెస్ట్ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఎందుకంటే..చంద్ర‌బాబు త‌న స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాలు.. అంద‌రూ.. రేపు టీడీపీకి ఓటు వేస్తార‌ని.. అనుకుంటున్న‌ట్టుగా.. ఆయ‌న‌లో మంద‌హాసాన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. ఇది మంచిదే. ఆత్మ విశ్వాసం పెర‌గాల్సిందే. కానీ, ఇప్పుడు అత్యంత అవ‌స‌రంగా చంద్ర‌బాబు దృష్టి పెట్టాల్సింది.. పార్టీ నేత‌ల‌పైనేన‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌నగ‌రం తీసుకుంటే.. మాజీ మంత్రులు చాలా మంది చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో క‌నిపించారు. వీరిలో సుజ‌య్ కృష్ణ రంగారావు, అశోక్‌గ‌జ‌ప‌తి రాజు.. ఇలా ఉన్నారు. అయితే.. వీరికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య క‌నెక్ష‌న్ త‌గ్గిపోయింది. ఇది నిర్వివాదాంశం. అంద‌రూ ఒప్పుకొనేదే.

ఇక‌, ఇత‌ర జిల్లాల్లోనూ ఇలాంటి నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌చ్చార‌ని .. వారంతా బ‌య‌ట‌కు వ‌చ్చారే త‌ప్ప‌.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడేళ్ల‌లో ఒక్క కార్య‌క్ర‌మం సొంతంగా నిర్వ‌హించిన నాయ‌కులు వంద మందికి పైగానే ఉన్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో అయితే.. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహ‌న్ త‌ప్ప‌.. ఇత‌ర నేత‌లు ప‌డ‌కేశార‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ళా వెంకట్రావు పోటీ నుంచి త‌ప్పుకొనే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

పోనీ.. ఆయ‌నేమ‌న్నా వ‌ర‌సుల‌ను ప్రోత్స‌హిస్తున్నారా? అంటే అది లేదు. ఇక‌, అశోక్ కుమార్తె.. కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉన్నారు. త‌ర్వాత‌.. ఎక్క‌డున్నారో కూడా తెలియ‌దు. అదేవిధంగా సుజ‌య్ కూడా ఇంతే. అంటే.. ఇత‌మిత్థంగా క‌నిపిస్తున్న విష‌యం.. ఇప్పుడు చంద్ర‌బాబు త‌న‌ను తాను ప‌రీక్షించుకోవ‌డం కాదు.. నాయ‌కుల‌ను ప‌రీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు 2019లానే అంతాబాగానే ఉంద‌ని అనుకుంటారో.. లేక మార్పు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తారో చూడాలి.
Tags:    

Similar News