మాస్‌ను వ‌దిలేసి క్లాస్‌తో కుస్తీయా చంద్ర‌బాబు...!

Update: 2022-08-26 23:30 GMT
రాజ‌కీయాల్లో ఏ పార్టీ అయినా.. ఏ నాయ‌కుడైనా.. ఎన్నిక‌ల  విష‌యానికి వ‌స్తే.. మాస్‌పై నే ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌తారు. ముఖ్యంగా మ‌హిళ‌ల ఓటు బ్యాంకుపైనే క‌న్నేస్తారు. అందుకే.. గ‌తం నుంచి ఇప్ప‌టి వ‌రకు కూడా మాస్ రాజ‌కీయాలు హిట్ట‌యిన‌ట్టుగా.. ఇత‌ర రాజ‌కీయాలు హిట్ కాలేదు. అదేస‌మ‌యంలో మ‌హిళా రాజ‌కీయాలు హిట్ట‌యిన‌ట్టుగా మేల్ పాలిటిక్స్ హిట్ కాలేదు. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ మ‌హిళ‌లను, మాస్‌ను చేరువ చేసుకుంది. దీంతో విజ‌యం ద‌క్కించుకుంది.

త‌ర్వాత‌.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి.. అతిపెద్ద కాంగ్రెస్‌ను కూడా మ‌హిళ‌ల‌కు.. మాస్‌కు.. రైతుల‌కు కూడా చేరువ చేశారు. ఫ‌లితంగా వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఇక‌, వైసీపీ కూడా.. ఈ ఫార్ములాతో ముందుకు సాగుతోంది.

ఎన్టీఆర్ హ‌యాంలో రూ.2 కే కిలో బియ్యం ప‌థ‌కం.. ఇప్ప‌టికీ.. పేద‌ల నోళ్ల‌లో నానుతూనే ఉంది. అదేస‌మయంలో ఆస్తిలో మ‌హిళ‌ల‌కు హక్కు క‌ల్పించిన ఎన్టీఆర్ మ‌హిళా ఓట‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. అదేవిధంగా వైఎస్‌.. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్‌.. వంటి కీల‌క ప‌థ‌కాల‌తో చేరువయ్యారు.

ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ కూడా తండ్రిబాట‌లో నడుస్తూ.. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతుల‌కు.. అమ్మ ఒడి ద్వారా.. మ‌హిళ‌ల‌కు.. సామాజిక ప‌థ‌కాలు.. పింఛ‌న్ల ద్వారావ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా.. మాస్‌కు చేరువ‌య్యారు.

దీంతో వారిపేరు చెప్ప‌గానే.. ఆయా ప‌థ‌కాలు ఠ‌క్కున గుర్త‌కు వ‌స్తున్నాయి. మ‌రి.. ఈ త‌ర‌హాలో చంద్ర‌బాబు కూడా ఏమైనా చేశారా? అంటే.. ఆ పార్టీ నాయ‌కులే చెప్ప‌డానికి స‌మ‌యం తీసుకుంటారు. మా నాయకుడు అభివృద్ధి ప్ర‌దాత అంటారు.

ఐటీ తెచ్చార‌ని.. అంటారు. నిజ‌మే కావొచ్చు. మేధావి వ‌ర్గంలో చంద్ర‌బాబుకు క్లీన్ ఇమేజ్ ఉండొచ్చు. కానీ.. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే.. మాస్ ఓట్లే క‌దా.. కీల‌కం. క్లాస్ పీపుల్ లైన్‌లో నిల‌బ‌డి.. ఓట్లు వేసింది.. కేవ‌లం 5 శాత‌మే. మాస్ 89 శాతం. మ‌రి దీనిని బ‌ట్టి.. మాస్‌ను ప‌ట్టించుకుని.. వారికి ఏదైనా చేసిన నాయ‌కులే.. లైవ్‌లో ఉన్నారు. అధికారంలోకి కూడా వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు.. మాస్ రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తేనే ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News