టీఆర్ఎస్ నోట టీడీపీ డైలాగ్ !

Update: 2022-05-09 10:55 GMT
రెండేళ్ల క‌రోనా కార‌ణంగా దేశీయ రుణాలను సంపాదించ‌డంలో జ‌గ‌న్ ముందుంటే విదేశీ రుణాల‌ను ద‌క్కించుకోవ‌డంలో మోడీ పై చేయి సాధించారు. ఆయ‌న ఎక్కువ కాలం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది విదేశాల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకే అని గ‌తంలో వామ‌ప‌క్షాలు చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు నిజం అవుతున్నాయి. నిర్థార‌ణ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితి అనే కాదు సాక్షాత్తూ పార్లమెంట్ వేదిక‌గా కూడా పాపం మోడీ త‌ర‌ఫు మ‌నుషులు అబ‌ద్ధాలు ఆడ‌డం మొద‌లు పెట్ట‌డం లేదు. అంటే వాళ్లు నిజాలే మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక ప‌రంగా మంద‌న గ‌మ‌న రీతిలో నెడుతున్నార‌న్న‌ది ఓ నిల‌క‌డలో ఉన్న నిజం. న‌మ్మ‌ద‌గ్గ, నిరూపించ‌ద‌గ్గ వాస్త‌వం కూడా  !

రానున్న‌ది అదే ! బాబు చెప్పిన విధంగా బాదుడే బాదుడు అన్న‌ది ఇప్పుడు ఏపీ,టీజీల‌ను క‌దిపి కుదిపేస్తుంది. అప్పుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ ప‌డుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నాలుగు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పు చేసింది. మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పుతో ముందుకు వెళ్తోంది.

టీడీపీ స‌ర్కారు అధికారం నుంచి దిగిపోయేనాటికి ఐదేళ్ల కాలానికి మూడు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పు చేస్తే ఐదేళ్ల కాల వ్య‌వ‌ధిలో అంత‌కు మూడు రెట్లు అప్పు చేయ‌నున్నారు జ‌గ‌న్. అంటే మూడు ల‌క్ష‌ల కోట్ల‌కు, తొమ్మిది ల‌క్ష‌ల కోట్లు క‌లిపితే 12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఏపీ అప్పు అని తేలింది. ఇక కేంద్రం అప్పు ఎంతున్న‌దో తేలుద్దాం రండి.

- ఎనిమిదేళ్ల కాలానికి 80 ల‌క్షల కోట్ల అప్పు

- 2021 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం

దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అప్పులు 60.5 శాతం ఉంద‌ని టీఆర్ఎస్  మీడియా చెబుతున్న వివ‌రం.

- విదేశీ రుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఇవాళ టీఆర్ఎస్ మీడియా గ‌గ్గోలు పెడుతోంది. ఆ విధంగా అప్పుల లెక్క తేల్చింది. 2021 మార్చి నాటికి విదేశాల నుంచి మనదేశం తీసుకొన్న అప్పు 570 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరిందని ఆర్బీఐ తెలిపింది. జీడీపీలో విదేశీ అప్పులు 21.1 శాతం...అని వెల్లడిస్తోంది కేసీఆర్ సొంత మీడియా!
Tags:    

Similar News