తెలుగుదేశం పార్టీలో ఒక అలవాటు ఉంది. ఎంతటి నేత అయినా చివరి నిముషంలో అధినాయకుడు చంద్రబాబుని మంచి చేసుకుంటే చాలు టికెట్ దక్కుతుంది. దానికి కారణం చంద్రబాబు మొహమాటం. ఆయన ఎవరినీ కాదనలేరు. తన దగ్గరకు వచ్చి అడిగితే నో అని చెప్పలేరు. అది బాబు బలహీనత అయితే ఇన్నాళ్ళు దాన్ని పట్టుకునే చాలా మంది తమ్ముళ్ళు రాజకీయాలలో తమదైన టాలెంట్ చూపించారు.
అయిటా 2019 ఎన్నికలు చంద్రబాబులో ఎంతో మార్పు తీసుకువచ్చాయి. ఈసారి తానూ దేనికీ లొంగను అని పనిచేస్తేనే టికెట్ అని మూడున్నరేళ్లుగా ఆయన చెబుతూనే ఉన్నారు. అయినా సరే చాలా మంది తమ్ముళ్ళు దిలాసాగా ఉన్నారు. బాబు చివరి నిముషంలో టికెట్లు ఇస్తారని వారు ధీమా పడ్డారు.
కానీ ఇపుడు తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వచ్చిన రాబిన్ శర్మ అతని కంటే ఘనుడు అన్నట్లుగా మారారు. ఆయన గెలుపు గుర్రాలకే టికెట్లు అని చెప్పడమే కాదు అలా చేయాల్సిందే అని బాబుకు కూడా స్పష్టం చేసారని టాక్. ఈసారి చావో రేవో అన్నట్లుగా అన్నట్లుగా టీడీపీకి ఉన్న పరిస్థితులలో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. గట్టిగా పట్టుబడుతున్నారు.
దాంతో చంద్రబాబు కూడా ఆయన చెప్పినట్లే అని అంటున్నారు. ఈ పరిణామంతో పార్టీని అంటిపెట్టుకుని దశాబ్దాలుగా రాజ్యం చేసిన సీనియర్ నేతలకు టికెట్ల గండంగా మారింది అని అంటున్నారు. రాబిన్ శర్మ తన టీం తొ మొత్తం నియోజకవర్గాలలో వడపోత పోసి మరీ గెలిచే వారిని ఎంపిక చేస్తారట. వారి పేర్లనే చంద్రబాబు తీసుకుని టికెట్లు ఇస్తారని అంటున్నారు.
అంటే ఇపుడు సీన్ లో ఉన్నది చంద్రబాబు కాదు రాబిన్ శర్మ. ఆయన పక్కగా అన్నీ చూస్తారు. గెలుపు అవకాశాలు లేకపోతె ఎంతటి పెద్ద నాయకుడిని అయినా పక్కన పెట్టేస్తారు. దాంతో ఇపుడు తమ్ముళ్ళకు చాలా మందికి నూటొకటి కొడుతోందిట. ఇక చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో యువతకు నలభై శాతం టికెట్లు అని ముందే ప్రకటించారు.
ఏ విధంగా చూసినా వారికి టికెట్లు వెళ్తాయి. దాంతో సీనియర్లకు నో చాన్స్ అని అంటున్నారు. కేవలం గెలుపు ప్రాతిపదికన సర్వే చేయడం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరూ ఏమీ అనడానికి లేదు. దాంతో ఈ పరిణామం కక్కలేక మింగలేక అన్నట్లుగా మారిందని అంటున్నారు.
మొత్తానికి రాబిన్ శర్మ డిజైన్ చేసిన ఇదేమి ఖర్మ ప్రోగ్రాం తమకే అన్వయించుకుంటూ తమకేమిటి ఈ ఖర్మ అని సీనియర్లు చాలా మంది వాపోతున్నారుట. మునుపటి బాబు కాదు, ఆయన మారిపోయారు. ఇక శర్మ సర్వేలు ఎలా ఉంటాయో తెలియదు. సొ మొత్తానికి తేలేది ఏంటి అంటే ఈసారి టీడీపీ టికెట్ దక్కడం బహు కష్టం గురూ అన్నదే మెజారిటీ తమ్ముళ్ళ మాటట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.