కృష్ణ జిల్లా గుడివాడకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు రావి వెంకటేశ్వరరావు కలకలం సృష్టించారు. స్దానిక క్లబ్ లో ఓ దశదిన కర్మ కార్యక్రమానికి హజరైన రావి వెంకటేశ్వర్ రావు తన దగ్గర ఉన్న రివాల్వర్ తో అకస్మాత్తుగా గాలిలోకి కాల్పులు జరిపారు. ఒక్క సారిగా పెద్ద ఎత్తున శబ్దం రావటంతో అక్కడ ఉన్న జనాలు భయభ్రాంతులు గురై పరుగులు తీశారు. కొద్దిసేపటికి రావి వెంకటేశ్వరావు కూడ అక్కడనుండి వెళ్లిపోయారు.
కాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాల్పుల సంగతి గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు కాని సాయంత్రానికి విషయం తెలియటంతో పోలీసులు రంగంలో కి దిగి క్లబ్ లో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ లో రివాల్వర్ లైసెన్సు గత సంవత్సరం డిసెంబర్ తో ముగిసినట్లు తెలిసింది. అయితే అసలు రావి వెంకటేశ్వరరావు కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందనే విషయం పోలీసులకు మిష్టరీగా మారింది. గుడివాడ డీఎస్ పీ అంకీనిడు ప్రసాద్ ఈ పరిణామంపై స్పందిస్తూ విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక విచారణలో రివాల్వర్ లైసెన్సు అయిపోయినట్లు ఉందని రెన్యువల్ కి దరఖాస్తు చేసుకున్నారో లేదో అని పరిశీలిస్తున్నామన్నారు. ఒక వేళ దరఖాస్తు చేసుకోకపోతే రావి వేంకటేశ్వర రావు మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/