బాబు ప‌ర్య‌ట‌న‌కు బ్రేక్‌.. అనుమ‌తించ‌ని అధికారులు

Update: 2023-01-04 08:08 GMT
త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయిన‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పోలీసులు చుక్క‌లు చూపిస్తున్నారు.  తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చం ద్రబాబు రోడ్‌షో, సభలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు రోడ్‌షో, సభలకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

పోలీసుల తీరుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడై నా.. సభలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సభ ను టీడీపీ నేతలు జరిపి తీరుతామంటున్నారు. టీడీపీ శ్రేణులను అడ్డుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో ఇదేం ఖ‌ర్మ పేరుతో టీడీపీ నేత‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విజ‌య‌న‌గ‌రం, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. అయితే.. గుంటూరు, కందుకూరు ఘ‌ట‌న‌ల నేప‌త్యంలో ప్ర‌భుత్వం స‌రికొత్త జీవోను తీసుకువ‌చ్చింది. దీని ప్ర‌కారం.. ర్యాలీలు, స‌భ‌ల‌కు కొంత నియంత్ర‌ణ ఉంటుంది.

ఇదే ఇప్పుడు ఏపీలోనూ సాగుతోంది.  కుప్పం ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని.. టీడీపీ నాయ‌కులు.. లేదు, టీడీపీ నేత‌లు త‌మ‌కు స‌రైన రోడ్ మ్యాప్ ఇవ్వ‌లేద‌ని పోలీసులు ప‌రస్ప‌రం వాదించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో  పోలీసులు టీడీపీ నేత‌ల‌కు నోటీసులు ఇచ్చారు. ఒక నిర్దేశిత ప్రాంతంలోనే స‌భ పెట్టుకోవాల‌ని.. పేర్కొన్నారు.

అయితే, ఈ నోటీసుల‌పై టీడీపీ నేత‌లు స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఉద‌యం పోలీసులు మ‌రో నోటీసు ఇచ్చారు. స‌మావేశాల‌కు ఎలాంటి అనుమ‌తి లేద‌ని తేల్చి చెప్పారు.  అంతేకాదు.. ఏదైనా జ‌రిగితే.. దానికి నేత‌లే బాధ్య‌త వ‌హించాల‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు, త‌గిన చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌న్నారు.  అయితే.. టీడీపీ నాయ‌కులు మాత్రం షెడ్యూల్ ప్ర‌కారం త‌మ నాయ‌కుడి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని.. మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News