రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకున్న 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందరూ రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటేయాలని విప్ జారీ పేర్కొన్నారు. కానీ టీడీపీ అధినేతకు భారీ షాక్ తగిలింది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలలో 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేసినట్లు చెబుతున్నారు.
ఇందులో ఇప్పటికే టీడీపీలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసినట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లను నిలబెట్టారని.. కానీ ఇప్పుడు ఓడిపోతారని తెలిసి దళిత నాయకుడు వర్ల రామయ్యను చంద్రబాబు నిలబెట్టారిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపించారు.
వల్లభనేని వంశీ తాజాగా మాట్లాడుతూ మొత్తం 23మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో కేవలం 17మంది మాత్రమే టీడీపీకి ఓటు వేశారని.. మిగతా వారు పార్టీ ఏజెంట్ వద్దకే రాలేదన్నారు. ఇదిలావుండగా, ఇఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించి ఎసిబి అధికారులు అరెస్టు చేసిన మాజీ కార్మిక మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నాయుడు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించబడలేదు. గుంటూరు జిల్లా రేపల్లే ఎమ్మెల్యే అనగని సత్య ప్రసాద్ (టిడిపి) రాజ్యసభ ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనలేదు. సత్య ప్రసాద్ తాను కరోనా వైరస్ నేపథ్యంలో హోం క్వారంటైన్ లో ఉన్నానని, ఓటు వేయడానికి అసెంబ్లీకి రాలేనని పేర్కొన్నాడు. అనగాని సత్యప్రసాద్ కూడా టిడిపిని వదిలి వైసీపీలో చేరాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికలలో ఆయన పాల్గొనకపోవడంతో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
ఏపీలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో 173 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సిపి వైపు మొత్తం 100 శాతం ఓటింగ్ నమోదైంది. 151 వైసిపి ఎమ్మెల్యేలు, 1 జనసేన ఎమ్మెల్యే, 3 మంది తిరుగుబాటు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి అభ్యర్థులకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో నలుగురు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులు రాజ్యసభ స్థానాలను గెలుచుకోనున్నారు. ప్రస్తుతం లెక్కింపు జరుగుతోంది.