ఎట్ట‌కేల‌కు ఏపీ టీడీపీ తుది జాబితా విడుద‌లైంది

Update: 2019-03-19 04:37 GMT
అభ్య‌ర్థుల్ని ఎంపిక చేయ‌టం ఎంత క్లిష్ట‌మైన ప్ర‌క్రియ అన్న‌ది ఏపీ ముఖ్య‌మంత్రి క‌మ్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌స‌ర‌త్తును చూసిన‌ప్పుడు అనిపించ‌క మాన‌దు. అభ్య‌ర్థుల్ని ఎంపిక చేయ‌టానికి మ‌రీ ఇంత భారీగా  క‌స‌ర‌త్తు చేయాలా? అన్న భావ‌న‌తో పాటు.. అభ్య‌ర్థుల ఎంపిక కోసం ఇన్ని కాంబినేష‌న్లు ఆలోచించాలా? అన్న సందేహం రాక మాన‌దు. ఇంతా చేస్తే.. ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల త‌ర్వాత పార్టీ నేత‌ల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతుందా? అంటే అది ఉండ‌దు. ఏ రాజ‌కీయ పార్టీ విడుద‌ల చేసే అభ్య‌ర్థుల జాబితా నూటికి నూరు శాతం సంతృప్తిక‌రంగా ఉండ‌టం సాధ్యం కాదు.

కానీ.. బాబు ఆలోచించే ఆలోచ‌న‌లు.. అభ్య‌ర్థుల ఎంపిక కోసం తాను శాస్త్రీయ విధానాన్ని అనుస‌రిస్తాన‌ని ఒకవైపు చెబుతూనే.. మ‌రోవైపు ఒత్తిళ్ల‌కు లొంగ‌టం.. కొంద‌రు నేత‌ల హెచ్చ‌రిక‌ల‌కు త‌లొగ్గ‌టం లాంటివి క‌నిపిస్తాయి. విడ‌త‌ల వారీగా విడుద‌ల చేస్తున్న అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితాలోతుది విడ‌త అభ్య‌ర్థుల్ని సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఫైన‌ల్ చేశారు.

చివ‌రి విడ‌త‌గా 37 మంది అసెంబ్లీ అభ్య‌ర్థుల లిస్ట్ ను రిలీజ్ చేశారు. తొలి జాబితాలో ఎంపిక చేసిన అభ్య‌ర్థులపై వ‌చ్చిన స్పంద‌న‌ను చూసి..  తుది జాబితాకు మెరుగులు దిద్దిన‌ట్లుగా చెబుతున్నారు. లోక్ స‌భ అభ్య‌ర్థుల ఎంపిక వేళ తీసుకున్న నిర్ణ‌యాలకు అనుగుణంగా తాజా జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు తాజా జాబితాలో చోటు ల‌భించ‌లేదు. వారిలో కొంద‌రికి ఎమ్మెల్సీ హామీ ల‌భించింది.

విజ‌య‌నగ‌రం.. క‌దిరి.. పోల‌వ‌రం.. క‌ర్నూలు త‌దిత‌ర స్థానాల్లో సిట్టింగుల‌కు సీట్లు ల‌భించ‌లేదు. సీనియ‌ర్ నేత‌లు.. ఆర్థికంగా బ‌ల‌మైన టీడీపీ నేత‌లుగా చెప్పే జేసీ దివాక‌ర్ రెడ్డి.. టీజీ వెంక‌టేశ్ ఒత్తిళ్ల‌కు బాబు లొంగిన వైనం టికెట్ల ఎంపిక‌ను చూస్తే అర్థం కాక మాన‌దు. కొద్దిమంది నేత‌ల వార‌సుల‌కు సీట్లు కేటాయించ‌టం క‌నిపించింది.
37 మంది టీడీపీ అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితా చూస్తే.. 

1. నెల్లిమర్ల- పతివాడ నారాయణస్వామినాయుడు

2. విజయనగరం- అదితి గజపతిరాజు

3. భీమిలి- సబ్బం హరి

4. గాజువాక- పల్లా శ్రీనివాసరావు

5. చోడవరం- కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు

6. మాడుగల- గవిరెడ్డి రామానాయుడు

7. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి

8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు

9. నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు

10. నర్సాపురం- బండారు మాధవనాయుడు

11. ఉండి- రామరాజు(రాంబాబు)

12. పోలవరం- బొరగం శ్రీనివాసరావు

13. తాడికొండ- తెనాలి శ్రావణ్‌కుమార్‌

14. బాపట్ల- అన్నం సతీష్‌ ప్రభాకర్‌

15. నరసరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు

16. మాచర్ల- అంజిరెడ్డి

17. దర్శి- కదిరి బాబురావు

18. కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

19. కావలి - విష్ణువర్ధన్‌రెడ్డి

20. నెల్లూరు రూరల్‌ - అబ్దుల్‌ అజీజ్‌

21. వెంకటగిరి - కె.రామకృష్ణ

22. ఉదయగిరి - బొల్లినేని రామారావు

23. కడప - అమీర్‌బాబు

24. రైల్వేకోడూరు -నర్సింహ ప్రసాద్‌

25. ప్రొద్దుటూరు - లింగారెడ్డి

26. కర్నూలు - టీజీ భరత్‌

27. నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి

28. కోడుమూరు- బి.రామాంజనేయులు

29. గుంతకల్లు - ఆర్‌.జితేంద్రగౌడ్‌

30. శింగనమల - బండారు శ్రావణి

31. అనంతపురం అర్బన్‌ - ప్రభాకర్‌ చౌదరి

32. కల్యాణదుర్గం -ఉమామహేశ్వరనాయుడు

33. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌

34. తంబళ్లపల్లె - శంకర్‌ యాదవ్‌

35. సత్యవేడు- జేడీ రాజశేఖర్‌

36. గంగాధరనెల్లూరు - హరికృష్ణ

37. పూతలపట్టు - తెర్లాం పూర్ణం


Tags:    

Similar News