విభజన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రధాన కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే.. మరికొన్ని మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అన్ని హంగులున్న ఏపీ అధికారపక్షం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మంగళగిరికి దగ్గరగా ఉన్న ఒక రిసార్ట్ ను తమ పార్టీ ప్రధాన కార్యాలయంగా మార్చుకుంది.
మంగళగిరి సమీపంలోని విజయవాడ హైవే మార్గంలో టీడీపీ తన కొత్త ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనుంది. అయితే.. ఆ నిర్మాణం పూర్తి అయ్యే లోపు హ్యాపీ రిసార్ట్ ను పార్టీ ప్రధాన కార్యాలయంగా మార్చుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీ ప్రధాన కార్యాలయానికి అవసరమైన అన్ని హంగులు ఉండటం.. సమావేశ మందిరంతో పాటు.. 30 వరకు గదులు ఉండటం.. రెస్టారెంట్ లాంటి అన్ని సదుపాయాల నేపథ్యంలో ఈ రిసార్ట్ ను పార్టీ ప్రధాన కార్యాలయంగా మారిస్తే సరిపోతుందన్న భావనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వందకు పైగా వాహనాలు వచ్చినా సరిపడే పార్కింగ్ సౌకర్యం కూడా ఉండటంతో ఈ రిసార్ట్‌ను భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటికే రెండేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు.
పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు.. శిక్షణ శిబిరాల్ని కూడా ఇక్కడే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ రిసార్ట్ లోనే తొలి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఇంతకాలం రిసార్ట్ సేవలు అందించిన హ్యాపీ రిసార్ట్.. ఇకపై తెలుగు రాజకీయాల్ని.. ప్రజల్ని ప్రభావితం చేసే నిర్ణయాలకు వేదిక కానుందని చెప్పక తప్పదు.