శ్రీశైలంలో టీడీపీకి మరో తలపోటు, బుడ్డా ఫ్యామిలీ లొల్లి!

Update: 2019-04-10 06:33 GMT
శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం ఇప్పటికే పలు మలుపులు తిరిగింది. ఈ నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి ముందుగా చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేయడం, అయితే ఆయన పోటీ నుంచి తప్పుకునే ప్రకటన చేయడం సంచలనంగా నిలిచింది.

టీడీపీ టికెట్ కోసం మాజీ మంత్రి ఏరాసుతో పోటీ పడ్డ బుడ్డా, తీరా టికెట్ దక్కాకా మాత్రం పోటీకి నో అని అన్నాడు. దానికి కుటుంబ కారణాలున్నాయనే ప్రచారం జరిగింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి సోదరుడు శేషా రెడ్డి ఈ సారి పోటీ చేయాలనేది వారి లెక్కట.

గత ఎన్నికల సమయంలోనే బుడ్డా రాజశేఖర  రెడ్డి ఈ హామీని ఇచ్చారట. అయితే ఈ ఎన్నికల సమయంలో శేషా రెడ్డి వైఎస్సార్సీపీలో మిగిలిపోయారు. రాజశేఖర రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్యన బ్యాలెన్స్ కుదరలేదు.

చంద్రబాబు నాయుడు ఏదో సర్ది చెప్పి బుడ్డా రాజశేఖర రెడ్డిని పోటీకి అయితే నిలిపారు. అయితే.. తీరా పోలింగ్ వేళ వారిలో మళ్లీ మనస్ఫర్థలు  హైలెట్ అవుతున్నాయని సమాచారం. బుడ్డా రాజశేఖర రెడ్డికి మద్దతును ఇచ్చేందుకు ఆయన కుటుంబీకులే ఇప్పుడు సిద్ధంగా లేరట. ఆయన విజయానికి సహకరించేది లేదని ఆయన కుటుంబంలో లొల్లి రేగిందని సమాచారం.

బుడ్డా రాజశేఖర రెడ్డి మాట మీద నిలబడలేదు అని, ఆయనను ఓడించాలని ఆయన సోదరుడు, ఇతర కుటుంబీకులే నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది!

ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

    
    
    

Tags:    

Similar News