ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న సత్తెన పల్లి నియోజకవర్గం టీడీపీలో ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంది. ఈ నియోజకవర్గంపై జరుగుతున్న రాజకీయం.. బహుశ మరో నియోజకవర్గంలో జరగడం లేదంటే .. అతిశయోక్తి కాదు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని.. రెండు కీలక కుటుంబాలు కాచుకుని కూర్చున్నాయి. అయితే.. చంద్రబాబు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అలాగని.. రెండు కుటుంబా లను ఆయన కోరుకుంటున్నారు.
ఒకవైపు.. మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఇక్కడ టికెట్ ఇవ్వాలని.. ఆయన కోరుతున్నారు. చంద్రబాబుకూడా సెంటిమెంటు కలిసి వస్తుంది.. కదా.. ఆయనకే ఇద్దామనే వ్యూహంతో ఉన్నారని కొన్నిరోజులు ప్రచారం జరిగింది. అయితే.. దీనికి వ్యతిరేకంగా.. ఇక్కడ ఎగస్పార్టీ తెరమీదికి వచ్చింది. గతంలో కోడెల కొందరిపై ఇక్కడ కేసులు పెట్టించారని.. సొంత పార్టీ నేతలపైనే ఆయన కేసులు పెట్టించడం.. అప్పట్లో చర్చనీయాంశం కూడా అయింది.
ఇప్పుడు వీరంతా కూడా.. వ్యతిరేక శక్తులుగా మారాయి. వీరంతా శివరామకృష్ణకు టికకెట్ ఇవ్వొద్దంటూ.. ఇటీవల మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌కు ఒక లేఖ సమర్పించారు. దీంతో అప్పటి వరకు శివరామకృష్ణ విషయంలో అంతో ఇంతో పాజిటివ్‌గా ఉన్న చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారు. మరోవైపు... ఇదే టికెట్‌ను నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు కోరుతున్నారు. అయితే.. ఈయనకు ఇచ్చే ఉద్దేశం పార్టీ అధిష్టానానికి లేదు.
దీంతో తమకు సత్తెనపల్లి కాకపోతే.. నరసారావుపేట టికెట్ అయినా.. ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలోనూ చంద్రబాబు కోరుతున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్ని రోజుల్లోనే చంద్రబాబు జిల్లాల యాత్ర ప్రారంభించనున్న నేపథ్యలో ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని ఆయన చక్కదిద్దుతారా? లేక.. అలానే వదిలేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా సత్తెనపల్లిపై పట్టు కోల్పోతే.. కష్టమనే వాదన వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.