అసెంబ్లీ సమావేశాలంటేనే టీడీపీ గుండెల్లో దడ !

Update: 2020-11-28 14:50 GMT
అసెంబ్లీ సమావేశాలు .. ప్రధానంగా ప్రతిపక్షాలకి ఓ సువర్ణావకాశం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీ సమావేశాల కంటే సరైన వేదిక మరొకటి ఉండదు. కానీ, ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కరోనా వైరస్ విజృంభణ తో రాష్ట్రంలో ఇతర సమస్యలు అన్ని కూడా సైడ్ అయిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సమస్య కరోనా మాత్రమే. అందుకే ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయాలంటే కరోనా మహమ్మారినే టార్గెట్ చేసుకోవాలి. ఇకపోతే, నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.

రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీ సమావేశాలు సమయం ఆసన్నం అవ్వడం తో ప్రభుత్వం ఆ దిశగా వేస్తుంది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ ప్రస్తావించటానికి పెద్దగా అంశాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి ఆరోపణలు చేయాలి కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిల్ అయ్యిందని, ఎస్సీ, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రచ్చ రచ్చ చేయడానికి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు ఉపయోగపడతాయి.

అయితే , ఈ వ్యవహారం ఇలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు అనగానే టీడీపీ గుండెల్లో గుబులు మొదలౌతుంది. దీనికి ప్రధాన కారణం .. అసెంబ్లీ సమావేశాలు అంటే ఎదో ఒక ఎమ్మెల్యే పార్టీ కి గుడ్ బై చెప్పచు . దీనితో ఈ సమావేశాల్లో ఎవరు ఝలక్ ఇస్తారో అని భయం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ టీడీపీ నుండి బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత మద్దాలి గిరి కూడా అలాగే బయటకి వచ్చేశాడు. ఆ మధ్య కరణం బలరామ్ కూడా పార్టీకి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే దూరం అయ్యారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇద్దరు ఎంఎల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి టీడీపీ కి గుడ్ బై చెప్పేశారు. ఈ మధ్య విశాఖపట్నం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా ఇలాగే పార్టీలో నుండి వెళ్ళిపోయారు. ఈ నెల 30 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో ఇంకెవరు పార్టీకి దూరం అవుతారో అనే చర్చ పార్టీలో అప్పుడే మొదలైపోయింది. అయితే , ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే టీడీపీ దూరమైనా ఏ ఎమ్మెల్యే కూడా వైసీపీలో అధికారికంగా చేరలేదు. అసెంబ్లీ లో మాత్రం టీడీపీ బెంచుల్లో కాకుండా , కొంచెం దూరంగా కూర్చుంటున్నారు.
Tags:    

Similar News