విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన సిటీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖపట్నం కి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. దీనికి తోడు పరిపాలన రాజధానిగా విశాఖపట్నం త్వరలో రూపుదిద్దుకోబోతుండటం తో విశాఖ కి ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. పరిపాలనా రాజధాని అంటే చిన్న విషయం కాదు , నిత్యం కోటాను కోట్ల వ్యాపారాలు , వచ్చి పోయే వారు లక్షల్లో ఉంటారు. దీనితో విశాఖ లో హోటల్స్ కూడా భారీ స్థాయిలో అవసరం అవుతాయి.
ఇక ఫైవ్ స్టార్ హొటల్స్ అంటేనే విలాసానికి మరో పేరుగా చెప్పవచ్చు. విశాఖలో ఇలాంటి హొటల్స్ అన్నీ ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వాటిని కట్టాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం అందమైన బీచ్ తీరాన్ని ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఉన్న హరితా రిసోర్ట్స్ స్థానంలో ఫైవ్ స్టార్ ప్లస్ పేరిట అత్యాధునిక హొటళ్ళను నిర్మిస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్తున్నారు. విశాఖకు విభజన తరువాత ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని, పెద్ద ఎత్త్తున పర్యాటకులు వస్తున్నారని ఆయన చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వమే ఫైవ్ స్టార్ హొటల్స్ కట్టాలనుకుంటోందని మంత్రి అంటున్నారు. ఇందుకోసం రెండు విడతలుగా ఏకంగా 164 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లుగా కూడా చెబుతున్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అయితే ఫైవ్ స్టార్ ప్లస్ పేరిట సర్కారీ హొటల్స్ ని తాము నిర్మిస్తామంటే తెలుగు తమ్ముళ్ళు వణుకుతున్నారని మంత్రి విమర్శిస్తున్నారు.
హరిత రిసార్ట్ పై కావాలనే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. హరిత రిసార్ట్ ప్రాంతంలో ఫైవ్ స్టార్ ప్లస్ హోటల్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ హొటల్స్ రాకతో టీడీపీ వారికి చెందిన ప్రైవేట్ హొటల్స్ గిరాకీ దారుణంగా తగ్గుతుందన్న భయం వల్లనే వారు రచ్చ చేస్తున్నారని ఆయన అంటున్నారు. మొత్తానికి విశాఖ బీచ్ రోడ్డులో రిసార్ట్స్ ప్లేస్ లో అందమైన హొటల్స్ రావడం అంటే అభివృద్ధిగానే చూడాలని వైసీపీ నేతలు అంటూంటే పాత వాటిని కూలగొట్టడం విద్వంశమే అవుతుంది అని టీడీపీ వారు అంటున్నారు.