చెప్పుకోవటానికి ఫార్టీ ఇయర్స్ ఇడస్ట్రీనే కానీ 24 గంటలూ జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడ్వటానికే సరిపోతోంది చంద్రబాబునాయుడుకు. జగన్ మీద, ప్రభుత్వం మీద పడి ఏడ్చేచే బదులు తెలుగుదేశంపార్టీని ఎలా బలోపేతం చేయటానికి సమయం కేటాయిస్తే బాగుంటుందని నేతలు, కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. ఎంతసేపు ఏడ్చినా మరో మూడేళ్ళు జగన్ అధికారంలో ఉండటం ఖాయమన్న విషయాన్ని తండ్రి, కొడుకులు మరచిపోయినట్లున్నారు.
జగన్ మీద దృష్టి పెట్టేబదులు పార్టీ బలోపేతంపై చంద్రబాబు ఎందుకు దృష్టి పెట్టడం లేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎంతసేపు జూమ్ యాప్ లో నేతలతో మీటింగులు పెట్టడాలు, కార్యకర్తలతో మాట్లాడటం, పార్టీ సానుభూతిపరులతో చర్చలు జరపటం తప్ప పార్టీ బలోపేతానికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు ఒకటికూడా లేదు.
చూడబోతే జూమ్ యాప్ కు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారా అనే సందేహం వచ్చేస్తోంది నేతల్లో. దేశం మొత్తంమీద జూమ్ యాప్ ను చంద్రబాబు ఉపయోగించినట్లుగా మరే నేత కూడా ఉపయోగించటం లేదమో. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జూమ్ యాప్ ను మాత్రం చంద్రబాబు వదిలిపెట్టడం లేదు. జరిగిందేదో జరిగిపోయిందని ఇప్పటికైనా జూమ్ యాప్ ను, జగన్ వదిలిపెట్టి కాస్త పార్టీ బలోపేతంపైన కూడా చంద్రబాబు దృష్టిపెట్టాలని నేతలు కోరుకుంటున్నారు.