రాజకీయాలు అంటేనే ఒక వ్యసనం. అక్కడ బోరు కొట్టే సీన్ ఉండదు, ఎన్ని సార్లు కుర్చీ ఎక్కినా కూడా అది తీరని దాహంగానే ఉంటుంది. రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ ఉండదు, దానికి నో ఏజ్ లిమిట్ కూడా. అందుకే భారత దేశ రాజకీయలలో చూసుకుంటే ఎనిమిది పదులు దాటిన వారు కూడా ఎంతో మంది కనిపిస్తారు. అటువంటి రాజకీయాల పట్ల ఎన్టీయార్ ముద్దుల తనయుడు నందమూరి నట సింహం బాలక్రిష్ణ విముఖత ప్రదర్శిస్తున్నారా అన్న చర్చ ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఏపీ అంతా హీటెక్కించిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఒకటి టీడీపీ ఆఫీసుల మీద దాడులు. ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగితే టీడీపీ నేతలంతా మండిపోయారు. ఒక రోజు బంద్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు ముప్పయి ఆరు గంటల పాటు ఆందోళన చేశారు.
టీడీపీలో యాక్టివ్ గా లేరు అనుకున్న వారు సైతం చంద్రబాబు దీక్షా స్థలిని సందర్శించి వైసీపీ మీద ఒక్క లెక్కన చెలరేగిపోయారు. మరి అటువంటి కీలకమైన సందర్భంలో బాలయ్య ఎక్కడా కనిపించలేదు. ఆయన మాట కానీ ఊసు కానీ లేదు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. పోనీ టీడీపీ మెయిన్ ఆఫీస్ మీద దాడి వరకూ అయితే ఊరుకోవచ్చు. కానీ హిందూపురంలో బాలయ్య క్యాంప్ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. అయినా బాలయ్య నుంచి ప్రకటన రాలేదు అంటున్నారు. మరి బాలయ్య ఎందుకిలా మౌనంగా ఉంటున్నారు అన్నదే ప్రశ్నట. అంతే కాదు బాలయ్య వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
ఏపీలో టీడీపీ విపక్షంలో ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన ఏడు పదుల వయసులో కష్టపడుతూంటే తలో చేయీ వేయాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. మరి బాలయ్య మాత్రం తన సినిమాలు తానూ అన్నట్లుగానే ఉన్నారు. లేటెస్ట్ గా ఆయన ఆహా లో టాక్ షోతో హోస్ట్ గా సరికొత్త అవతారం ఎత్తారు కూడా. ఈ నేపధ్యంలో బాలయ్య వైఖరి మీద అనేక డౌట్లు వస్తున్నాయని అంటున్నారు. అయితే బాలయ్య వర్తమాన రాజకీయాల పట్ల ఆసక్తిగా లేరు అన్న ప్రచారం కూడా సాగుతోంది అంటున్నారు.
అదే టైమ్ లో టీడీపీలో అల్లుడు నారా లోకేష్, బావ చంద్రబాబు తప్ప బాలయ్యకు పెద్దగా ప్రాధాన్యత ఉండడం లేదు అంటున్నారు. 2014లో పార్టీ గెలిచినపుడే బాలయ్య జస్ట్ ఎమ్మెల్యేగానే అయిదేళ్ళూ కొనసాగారు. ఇక 2024లో మరోమారు అధికారంలోకి వస్తే మంత్రి అవుతారు అన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ లకు కచ్చితంగా పదవులు ఉంటాయి. బాలయ్యకు ఇవ్వాలీ అంటే ఒకే కుటుంబానికి మూడు పదవులు అన్న విమర్శలు వస్తాయి. అంటే మళ్లీ గెలిచినా ఎమ్మెల్యేగానే బాలయ్య కొనసాగాలన్న మాట. అందుకే బాలయ్య రాజకీయాల పట్ల పెద్దగా సీరియస్ గా ఉండడం లేదు అంటున్నారు. ఏది ఏమైనా నందమూరి వారి వంశం నుంచి బాలయ్యే ఇపుడు టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా సైడ్ అయితే టీడీపీ ఫక్త్ నారా వారిదే అవుతుంది.