ప్రతిపక్ష టీడీపీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా తాజాగా ఒక ఘాటు పోస్టు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాచర్ల వైయస్ఆర్సిపి నాయకుడు తురక కిషోర్ ను మాచర్ల మునిసిపల్ చైర్మన్ పదవికి అధికార పార్టీ ప్రకటించడాన్ని టీడీపీ తన పోస్టులో తప్పు పట్టింది.
లాక్ డౌన్ కు ముందు స్థానిక ఎన్నికల నేపథ్యంలో మాచర్లకు వచ్చిన తెలుగుదేశం నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై తురక కిషోర్ మరికొందరితో కలిసి కర్రలతో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. పబ్లిక్‌గా కొందరిపై హత్యాయత్నం చేసిన రౌడీని ఏమాత్రం సిగ్గులేకుండా మునిసిపల్ చైర్మన్ ను చేస్తోంది వైసీపీ అని టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో ఆరోపించారు. ఈ రౌడీగారిని నెత్తిన ఎత్తుకోవాలో వద్దో ప్రజలే ఆలోచించుకోవాలని హితవు పలికింది. ప్రజలు తలచుకుంటే మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడం ఎంతసేపు? అంటూ ప్రశ్నించింది.
తురక కిషోర్ తోపాటు అతని మద్దతుదారులను ‘రౌడీలు’ అని పిలుస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం రెండు ట్వీట్లలో విమర్శించింది. కిషోర్ మునిసిపల్ ఛైర్మన్ గా ఎదగడానికి వైయస్ఆర్సిపి ఇలా ప్రోత్సహిస్తోందని ఎండగట్టింది.. “ఈ రౌడీ గారి’ను అంగీకరించాలా వద్దా అని ప్రజలు మాత్రమే నిర్ణయించుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేసింది.
అధికారిక టీడీపీ విభాగం చేసిన ఈ రెండు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. టిడిపి - వైయస్ఆర్సిపి మద్దతుదారులు మాటల కౌంటర్లతో దీనిపై సోషల్ మీడియా యుద్ధంలో పాల్గొంటున్నారు. టిడిపి నాయకులపై కిషోర్ హింసాత్మక దాడి ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టి రచ్చ చేస్తున్నారు. మరి ఇది ఎన్నికలలో ఏమైనా ప్రభావం చూపిస్తుందో లేదో చూడాలి.