హ‌ద్దులు మీరిపోయారు.. ఒరేయ్‌.. ఒసేయ్‌.. బ‌జారుమ‌నిషి !: ఏపీలో నేత‌ల ఫైర్‌

Update: 2022-04-25 12:30 GMT
ఏపీలో రాజ‌కీయాలు పూర్తిగా అదుపు త‌ప్పాయి. నాయ‌కులు హ‌ద్దులు దాటేశారు. ఒరేయ్.. ఒసేయ్‌.. అనుకునే రేంజ్‌కు దిగ‌జారిపోయారు. అంతేకాదు.. మ‌హిళా నాయ‌కురాలిని టీడీపీ నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్యే ఏకంగా ``బ‌జారు మ‌నిషి`` అని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయం పూర్తిగా వేడెక్కిపోయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అంతకు మునుపు పద్మ ఈయనను ఉద్దేశించి ‘ఒరేయ్‘ అని వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహే శ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియామీట్ నిర్వహిం చిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు.

గ్యాంగ్‌రేప్‌ ఘటనపై తూతూ మంత్రం గా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుందన్నారు. `వాసిరెడ్డి పద్మ బజారు మనిషి` అన్నారు. ఆమె మాట్లాడుతున్న తీరు కూడా అలానే ఉంద‌న్నారు.

‘నువ్వు అరేయ్‌ అంటే మేం ఒసేయ్‌ అనలేమా..?. జగన్‌ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారు. మా ప్రజాపోరాటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మేకప్‌ వేసుకొని ఆస్పత్రికి వచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ కక్షతోనే మాకు నోటీసులు ఇచ్చారు.

వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తొలగించేవరకు న్యాయపోరాటం చేస్తాం. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు మేము వెళ్లే ప్రసక్తే లేదు. ఈ నెల 27 లోపు అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం.`` అని బొండా వ్యాఖ్యానించారు.

``మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీరు హేయం. బాధితురాలికి అండగా నిలవడం మా తప్పా?. ఘటన జరిగిన మూడ్రోజులైనాక బాధితురాలి పరామర్శకు వచ్చారు. వాసిరెడ్డి పద్మ నోటీసులకు స్పందించేదే లేదు. దీనిపై మేం న్యాయ పోరాటానికి సిద్ధం. బాధితులకు అండగా ఉండడం చంద్రబాబు చేసిన తప్పా?’ అని వాసిరెడ్డి పద్మపై బోండా ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు.
Tags:    

Similar News