పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి రైతులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా పొలాల్లోకి వెళ్లి మరీ.. రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల పరిధిలో దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను బాబు పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప, రైతుల కష్టాలు పట్టవన్న చంద్రబాబు... ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని... రైతుల మెడకు తాడు బిగించి లాగేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తి ఎకరాకు రూ.30 వేలు, మిర్చికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలన్నారు.
సూక్ష్మ సేద్యం పరికరాలు రాయితీతో ఇచ్చిన ప్రభుత్వం టీడీపీనే అని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిన పాపం ఈ ప్రభుత్వా నిదని ధ్వజమెత్తారు. అమరావతి రైతులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.
రైతులు బంగారం పెట్టుకుంటే ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. తన జీవితంలో దాపరికం లేదని.. ఏపీని మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టే వరకూ కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు విశాఖలో పర్యటించే హక్కు లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతల భూ కబ్జాలు బయటపడతాయని భయమా? అని నిలదీశారు. జనసేన వారిపై దాడులు చేసి మళ్లీ వారిపైనే కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. వినుకొండలో ఎమ్మెల్యే రైతును చెప్పుతో కొట్టి జైల్లో వేయించారన్నారు. జగన్.. ఆయన మాదిరిగా మరికొందరు సైకోలను తయారు చేస్తున్నారని విమర్శించారు.
గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో 155 మంది, గుంటూరు జిల్లాలో 205 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జగన్ నాటకాలకు కాలం చెల్లిందన్నారు. జగన్ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.