టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు కు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ప్రయత్నించారు. అయితే, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు, చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు చెక్పోస్ట్ వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నాయకుడిని అరెస్టు చేయడానికి వీల్లేదంటూ ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మొత్తంమీద చింతమనేని ప్రభాకర్ అరెస్టు కావడం ఇది 14వ సారి. ఇదివరకు ఆయన పలు కేసుల్లో అరెస్టు అయ్యారు. కారాగార జీవితాన్ని గడిపారు. కొద్దిరోజుల కిందటే బెయిల్ మీద బయటికి వచ్చారు. కాగా, ఈఎస్ ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి, సోదాలు కూడా నిర్వహించారు. అచ్చెన్నాయుడును శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు.