ఇప్పుడు ఎన్నికలు వద్దు..ప్రజల ప్రాణాలే ముద్దు..టీడీపీ నేత ఫ్లెక్సీ వైరల్!
ఏపీలో ఓ వైపు కరోనా మహమ్మారి జోరు చూపిస్తున్నా , లోకల్ ఎన్నికల వేదికగా రచ్చ జరుగుతూనేఉంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఇప్పుడే లోకల్ ఎన్నికలు అవసరం లేదు అని అంటే , టీడీపీ మాత్రం ఎన్నికలకి పట్టుబడుతోంది. అలాగే రాష్ట్రంలో స్కూల్స్ తెరచారు , అప్పుడు రాని కరోనా కేవలం ఎన్నికలు పెడితేనే వస్తుందా అని విమర్శలు చేస్తున్నారు. ఈ లోకల్ ఎన్నికల చుట్టూ టీడీపీ , వైసీపీ మధ్య వివాదం జరుగుతుంటే .. విజయవాడలో ఓ టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ వద్దంటూ విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహించవద్దని ఆయన ఫ్లెక్సీలో ప్రస్తావించారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని అన్నారు. ఫ్లెక్సీలో ఇప్పుడు ఎన్నికలు వద్దు.. ప్రజల ప్రాణాలే ముద్దు అన్నారు. మాయదారి రోగం కరోనాకు లక్షల జనం చనిపోయారని, ఇంకా చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారని, ఇంకా కరోనాకి వ్యాక్సిన్ రాలేదని గుర్తు చేశారు. స్కూళ్లు తెరవడం తో పిల్లలు,చ టీచర్ల ప్రాణాలు పోయేలా ఉన్నాయన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పంతాలకు పోయి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టొద్దన్నారు. మరోవైపు ఈ ఫ్లెక్సీ విషయంపై కాట్రగడ్డ బాబు స్పందించారు. స్థానిక ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వెళుతున్నానని అంటున్నారని కానీ తాను ప్రస్తుతం జరుగుతున్న విషయం గురించి మాట్లాడాను అంటున్నారు.