ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీ విపక్షం నుంచి ఒక్కొక్కరిగా సైకిల్ ఎక్కిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొలిసారి కాస్త చిత్రమైన అనుభవం ఎదురైందని చెప్పాలి. విపక్షం నుంచి నేతల్ని సైకిల్ ఎక్కించటం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తున్న ఆయన తీరుతో.. కొందరు తమ్ముళ్లు ఇబ్బంది పడుతున్నా.. వారిని బుజ్జగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి బుజ్జగింపుల విషయంలో నిర్లక్ష్యానికి ఫలితంగా ఒక ఎన్ ఆర్ ఐ ప్రముఖుడు పార్టీకి రాజీనామా చేసేసి వెళ్లిపోతున్నట్లుగా ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.
ఓన్లీ ఇన్ కమింగ్.. నో అవుట్ గోయింగ్ అన్నట్లుగా ఉన్న తెలుగుదేశంలో ఈ మధ్యనే అందుకు భిన్నమైన సన్నివేశాలు చోటు చేసుకోవటం గమనార్హం. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అయిన ఐవీ రెడ్డి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా.. ఆయన ఆక్రోశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటంతో కోపం వచ్చిన ఆయన సైకిల్ దిగేశాడు.
ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. టీడీపీలో చేరి తాను తప్పు చేసినట్లుగా ప్రకటించారు. విభజన తర్వాత చంద్రబాబు ఏపీని బాగు చేస్తారన్న ఉద్దేశంతో తాను పార్టీలో చేరానని.. కానీ తన ఆశలు వమ్ము అయ్యాయయని ఆయన చెబుతున్నారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదన్న ఆయన.. జరుగుతున్న పరిణామాలకు నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తవాళ్లను తెచ్చుకోవటం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవటం బాగున్నా.. ఇప్పటికే పార్టీలో ఉన్న వారిని పోగొట్టుకోవటంకూడా మంచిది కాదన్న విషయాన్ని చంద్రబాబు.. చినబాబులు గుర్తిస్తారా..?