దాదాపుగా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంతం. బొత్సకు ఓటములు ఉన్నాయి. కానీ ఆయన గెలుపు ఎపుడూ రీ సౌండ్ చేస్తుంది. ఉత్తరాంధ్రా యాసలో మాట్లాడుతూ అందరికీ ఆప్తుడిగా మెలుగుతూ బొత్స చేసే పాలిటిక్స్ పక్కా లోకల్ గా ఉంటుంది. అందుకే అంతా ఆయన్ని ఓన్ చేసుకుంటారు.
ఇక బొత్స ఇప్పటికి పలుమార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఆయనే చెప్పుకున్నట్లుగా పదమూడేళ్ళ మినిస్టర్. సీనియర్ లీడర్. స్టేట్ ఫిగర్. బీసీల పెద్దగా ఉన్నారు. మాజీ పీసీసీ చీఫ్ ట్యాగ్ ఎటూ ఉంది. అలాంటి బొత్స 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆ పార్టీ నుంచి డిపాజిట్లు దక్కించుకున అతి కొద్ది మందిలో ఒకరు.
నాడు బొత్సను ఓడించింది ఎవరో కాదు, టీడీపీ సీనియర్ లీడర్ కిమిడి కళా వెంకటరావు మరదలు మృణాళిని. అయితే తరువాత బొత్స వైసీపీలో చేరి స్పీడ్ పెంచారు, గేర్ మార్చారు. మొత్తానికి 2019 నాటికి ఆయన చీపురుపల్లిలో పోటీ చేసి మృణాళిని కుమారుడు నాగార్జునను ఓడించారు.
ఇక్కడ నాగార్జున గురించి చెప్పుకోవాలి. ఆయన ఫస్ట్ టైమ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బొత్స లాంటి బిగ్ షాట్ ని ఎదుర్కొన్నారు. దాంతో అనుభవం బాగా వచ్చింది. ఇక చురుకైన నైజం, బీసీ కార్డు, కాపు కాసే సామాజికవర్గం అన్నీ కలగలిపిన బలం చూసి చంద్రబాబు ఆయన్ని తెచ్చి విజయనగరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ చేశారు.
దాంతో జిల్లాలో ఆయన ఎంతలా తిరుగుతున్నారు అన్నది పక్కన పెడితే చీపురుపల్లిలో మాత్రం దూకుడు పెంచేశారు. ఆయన అక్కడ పల్లె నిద్రలు చేస్తున్నారు. గ్రామాలను పట్టుకుని తిరుగుతున్నారు. వారితోనే తింటూ, వారి మాట వింటూ తనదైన రాజకీయాన్ని పండిస్తున్నారు. దాంతో యువకుడు కూడా కావడంతో నాగార్జున వైపు చీపురుపల్లి జనాలు మెల్లగా టర్న్ అవుతున్నారు.
ఇక లేటెస్ట్ కుదుపు ఏంటి అంటే బొత్సకు బలంగా ఉన్న కీలకమైన నాయకులతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంతా టీడీపీ తీర్ధం పుచ్చేసుకున్నారు. ఇది బొత్సకు భారీ షాక్ అంటున్నారు. ఇదే తీరున నాగార్జున కనుక తన జోరు పెంచితే వచ్చే ఎన్నికల్లో బొత్సకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. బొత్స మూడేళ్ళుగా మంత్రిగా ఉన్నా చీపురుపల్లికి ఏదీ చేయలేకపోవడం, జనాలతోనే కాదు పార్టీ నాయకులతో కూడా ఇంటరాక్షన్ పెద్దగా లేకపోవడం మైనస్ గా ఉంది. అదే ఇపుడు టీడీపీ యంగ్ టర్క్ కి ప్లస్ అవుతోంది అంటున్నారు.