కక్కుర్తి కాక దీన్నేమనాలి? ప్రజాజీవితంలో ఉన్న వారెంత జాగ్రత్తగా ఉండాలి? నలుగురికి స్ఫూర్తివంతం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పలేం కానీ.. వేలెత్తి చూపించుకునే పనుల్ని మాత్రం చేయకూడదు. నలుగురికి చెప్పే స్థానంలో ఉండి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చోటు చేసుకునే ఇబ్బందికర పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పాలి. టీడీపీ నేత ఒకర్ని పోలీసులు వ్యభిచారం కేసులో అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది.
అమరావతి దళిత జేఏసీ నేత కమ్ టీడీపీ నాయకుడు చిలకా బసవయ్యను ఆదివారం తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఒక యువతితో వ్యభిచారం చేస్తున్న వేళ.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాయపూడి 6 మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఉన్న ఒక రేకుల షెడ్డులో అతగాడు రాసలీలలు చేస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు.
రేకుల షెడ్డు బయట ఒక వ్యక్తిని కాపలా పెట్టుకొని మరీ రాసలీలలు సాగిస్తున్న వైనాన్ని గుర్తించిన పోలీసులు ఈ టీడీపీ నేతను అరెస్టు చేశారు. దళిత జేఏసీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ.. మాయ మాటలు చెప్పి సదరు యువతిని లొంగదీసుకుంటున్నారన్న ఆరోపణలు బసవయ్యపై ఉన్నాయి. స్థానికంగా పెను సంచలనంగా మారిన ఈ వ్యవహారం.. పార్టీకి సైతం చెడ్డపేరును తీసుకొస్తుందన్న మాట వినిపిస్తోంది. కక్కుర్తి కాకపోతే ఇదెక్కడి దరిద్రం అంటూ జనాలు తిట్టుకునే పరిస్థితి.