టీడీపీకి వైసీపీ `రివ‌ర్స్` కౌంట‌ర్ అదిరిందే!

Update: 2017-10-18 10:19 GMT
ఏపీలో ఎన్నిక‌ల మూడ్ మొద‌లైపోయింది! టీడీపీ - వైసీపీ వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ప‌దునెక్కుతున్నాయి! విప‌క్షాన్ని ఎలాగైనా బ‌ల‌హీనప‌ర‌చాల‌ని టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీశారు. ఇక దాని ఫ‌లిత‌మే ఏకంగా 20 మందికి పైగా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు! దీంతో ఆత్మ‌స్థైర్యం కోల్పోయిన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌-2కి తెర‌తీశారు చంద్ర‌బాబు! నైతికంగా వైసీపీని దెబ్బ‌తీశామ‌ని భావిస్తున్న టీడీపీకి పెద్ద షాక్ త‌గిలింది. వైసీపీ రివ‌ర్స్ ఆప‌రేష‌న్ ఆకర్ష్‌కు తెర‌తీసింది! ఇది విజ‌య‌వంత‌మైంది. టీడీపీ నేత ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు!!

వైసీపీలో జోష్ మొదలైంది. మ‌రికొద్ది రోజుల్లో జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేస్తున్న ప్రారంభించ‌బోతున్న త‌రుణంలో.. ఆ పార్టీ ఎంపీ టీడీపీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పార్టీశ్రేణులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ ఇప్పుడు వీరి నిరుత్సాహం వెంట‌నే ఆవిరైపోయింది. స‌రికొత్త ఉత్సాహం ఇప్పుడు వీరిలో ఉర‌క‌లేస్తోంది! దీనికి కార‌ణం.. రివ‌ర్స్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ సక్సెస్ అయింది. ప్ర‌స్తుతం టీడీపీ నేత ఒకరు వైసీపీలో చేరారు. టీడీపీలో అసంతృప్తి నేతలను తమ వైపున‌కు తిప్పుకొనేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇవి ఫ‌లిస్తున్నాయి.

ఇతర పార్టీల నుంచి అధికార పార్టీల్లో పలువురు నేతలు చేరడంతో కొందరు అధికార పార్టీ నేతలు కూడ తీవ్ర అసంతృప్తికి గుర‌వుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఎక్కువవుతుండటంతో.. అందుకు దీటుగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ అధిష్టానం పక్కా ప్లాన్‌ తో ముందుకెళుతోంది. తాజాగా అనంతపురం జిల్లా చౌళూరుకు చెందిన టీడీపీ నేత రాజారెడ్డి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. రాజారెడ్డికి వైసీపీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Tags:    

Similar News