మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో. అసలే మొన్నటి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ఘోర పరాభవంతో టీడీపీ చచ్చిన పాములానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో పార్టీకి కంకణబద్ధులుగా నిలిచిన నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడితే... పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ టీడీపీలో ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ శాఖలో కీలక నేతగా ఉన్న సామ రంగారెడ్డి ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి పారేశారు. టీడీపీకి రాజీనామా చేయడంతోనే సరిపెట్టని సామ రంగారెడ్డి... పార్టీ అధిష్ఠానానికి మంట పుట్టే కామెంట్ కూడా చేశారు.
తాను బీజేపీలో చేరుతున్నానని, అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన రంగారెడ్డి... తాను ఎందుకు పార్టీ మారుతున్నానన్న విషయాన్ని కూడా చెప్పేశారు. టీడీపీ తెలంగాణ శాఖ నాయకత్వం లోపం కారణంగానే తాను పార్టీ మారుతున్నానని కూడా రంగారెడ్డి చెప్పారు. టీడీపీని అతి దగ్గరగా చూసిన వారికి తప్పించి పెద్దగా పరిచయం లేని సామ రంగారెడ్డి ఉంటే ఎంత? పోతే ఎంత? అనడానికి కూడా లేదు. ఎందుకంటే గడ్డి అన్నారం కేంద్రంగా పార్టీలో కీలక నేతగా ఎదిగిన రంగారెడ్డి పార్టీలో నిబద్ధత కలిగిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు.
అయితే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెబుతూనే కాలయాపన చేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొన్నటి ఎన్నికల్లోనూ రంగారెడ్డికి మొండిచెయ్యే చూపారు. ఇలా చంద్రబాబు నుంచి ఎన్ని పర్యాయాలు రిక్త హస్తమే అందినా కూడా రంగారెడ్డి పార్టీ మారే దిశగా ఆలోచించలేదనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న రంగారెడ్డి తన రాజీనామాతో చంద్రబాబుకు షాకిచ్చారనే చెప్పాలి. అది కూడా చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సమయంలోనే రంగారెడ్డి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.