సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన గురించి తెలుగుదేశం పార్టీ గందర గోళంలో పడినట్టు గా ఉంది. ఆ ప్రకటన ను గట్టిగా వ్యతిరేకించనూ లేక, సమర్థించనూ లేక వారు మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు. జగన్ అసెంబ్లీ లో చేసిన ప్రకటన ను చంద్రబాబు నాయుడు మొదట గట్టిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత మాత్రం ఆ దూకుడు లేదు. ఆ ప్రకటనను వ్యతిరేకిస్తే.. అమరావతి పేరుతో రాజకీయానికి ఉపయోగపడటం మాట ఎలా ఉన్నా, అటు రాయల సీమ లోనూ, ఇటు ఉత్తరాంధ్ర లోనూ దెబ్బ తప్పదని చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందుకే ఆయన ఆ విషయం గురించి ఇప్పుడు స్పందించడమే లేదు.
ఇక అటు రాయలసీమ నేతలు, ఇటు ఉత్తరాంధ్ర నేతలూ సీఎం ప్రకటనను స్వాగతించారు. రాయలసీమకు హై కోర్టు దక్కడం మేలని ఆ ప్రాంత నేతలు, ఆ విశాఖ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా మేలని విశాఖ టీడీపీ నేతలు మొదట ప్రకటనలు చేశారు. అయితే ఆ ప్రకటనలు తెలుగుదేశం పార్టీ వైఖరికి వ్యతిరేకం అవుతున్నాయి.
అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ అసెంబ్లీ లో కూడా ప్రకటన చేసింది. ఆ పార్టీ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే అని, ఇప్పుడు అమరావతిలో రియల్ బూమ్ తగ్గిపోతే టీడీపీ వాళ్లే ఇబ్బంది పడతారు కాబట్టి.. అందుకే అమరావతి కి అనుకూల వాదన ఆ పార్టీ చేస్తోందనే ఒక ప్రచారం ఉంది. అయితే తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు జగన్ ప్రకటనను స్వాగతిస్తున్న వైనం స్పష్టం అయ్యింది. కానీ అది పార్టీ ప్రయోజనాలకు విరుద్ధం!
ఇలా తెలుగు దేశం పార్టీ లో గందరగోళం నెలకొంది. అందుకు సంబంధించి ఇప్పుడు సవరణ ప్రకటనలూ మొదలయ్యాయి. జగన్ మూడు రాజధానుల ప్రకటనలను తప్పు పడుతూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. మొదట్లో ఈ ప్రకటనలను స్వాగతించిన టీడీపీ నేతలే ఇప్పుడు దాన్ని తప్పు పడుతూ ఉన్నారు. వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. మొదట్లో ఈయన కర్నూలులో హై కోర్టును సమర్థించారు.
అయితే తన తాజా ప్రకటనలో ఈయన దాని ఊసు ఎత్తలేదట. సీఎం జగన్ ప్రాంతీయ విబేధాలు సృష్టిస్తున్నారంటూ మాత్రం మండి పడ్డారట. మొత్తానికి తెలుగు దేశం నేతలు చాలా గందరగోళంలోనే ఉన్నట్టు గా ఉన్నారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.