మోదీ ప్రశంసల వెనక..!

Update: 2015-06-26 13:30 GMT
జీహెచ్‌ఎంసీలోని పన్నుల విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. పదేళ్లలో ఆదాయాన్ని ఏడు రెట్లు పెంచడాన్ని కొనియాడారు. అది కూడా ప్రజలపై ఎటువంటి పన్నులు వేయకుండా.. ఉన్న పన్నులతోనే ఏడు రెట్లు ఆదాయం పెరగడం నభూతో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, దీనికి తమదైన శైలిలో భాష్యం చెబుతున్నారు టీడీపీ నాయకులు.

ఎటువంటి పన్నులూ పెంచకుండా ఆదాయం ఎలా పెరుగుతుందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌కు పెద్దపీట వేశారని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీని తీసుకు రావడమే కాకుండా కొత్తగా సైబరాబాద్‌ను నిర్మించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలోనే హైదరాబాద్‌కు దేశ విదేశీయులు వెల్లువెత్తడాన్ని వివరిస్తున్నారు. అప్పటి నుంచే నగరం ఇబ్బడిముబ్బడిగా విస్తరించిందని కూడా గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగారని, దాంతోపాటే ఇళ్లు పెరిగాయని, దాని కారణంగానే ఎటువంటి పన్నులు పెంచకుండా ఆదాయం పెరిగిందని వివరిస్తున్నారు. ఇందులో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రతిభ ఏమాత్రం లేదని వివరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిభ కూడా శూన్యమేనని వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో హైదరాబాద్‌ ఇమేజీని పెంచడంతో జనాభా ఇబ్బడిముబ్బడిగా వచ్చారని, ఇళ్లు కట్టుకున్నారని, అపార్టుమెంట్లు పెరిగాయని, ఆదాయానికి కారణం అవేనని వివరిస్తున్నారు.

Tags:    

Similar News