కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ - పార్టీ నేతలు సుబ్రమణ్యం - చందూ సాంబశివరావు ఈ మేరకు ముద్రగడ తీరును తప్పుపట్టారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్ర కాపుల కోసమా. తన సొంత ప్రయోజనాల కోసమా అంటూ నిలదీశారు. ముద్రగడ పాదయాత్ర నిజంగా కాపుల కోసమే అయితే బలిజలను అణగదొక్కుతున్న ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ వరకు చేయాలని - అప్పుడే ముద్రగడ కాపుల కోసం పాదయాత్ర చేసినట్లుగా అవుతుందని. లేని పక్షంలో సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా ఉంటుందని వారు విశ్లేషించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎదుర్కొనే దమ్మలేకనే వైసీపీ నేతలు శిశుపాలుడిలా విమర్శలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు రోజా - అంబటి రాంబాబు వంటి నేతలు అవాకులు - చవాకులు పేలుతున్నారని అభ్యంతరం చెప్పారు. వైసీపీ చేపట్టిన గడప గడపకూ కార్యక్రమంతో పాటు అన్ని కార్యక్రమాలు విఫలం అవడం - త్వరలో నారా లోకేష్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుండటంతో.. దీనిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అందుకే ముద్రగడను అడ్డుపెట్టుకుని కులాల వారీగా రెచ్చగొడుతున్నారని తప్పుపట్టారు. బీసీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం గమనించకుండా విమర్శలు చేసే వారి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/