ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న.. ఆ రెండు రోజులేనా!

Update: 2017-01-19 06:56 GMT
న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌముడు, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామారావుకు దేశ అత్యున్న‌త పురస్కార‌మైన‌ భార‌త‌ర‌త్న ఇచ్చేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఏడాదిలో కేవ‌లం రెండు రోజులే... అదీ తూతూ మంత్రంగా పోరాడుతోందా అంటే... అవున‌నే అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

జ‌న‌వ‌రి 18న ఎన్టీఆర్ 21వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌లే మ‌ర‌ణించిన త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. పార్టీలో ఆమెకు బంధువులెవ‌రూ లేక‌పోయినా అమ్మ‌గా భావించిన నేత‌లే ఇందుకు కంక‌ణం క‌ట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేస్తోంటే.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌డంలేద‌ని ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర‌ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏటా కేవ‌లం రెండు రోజులే "ఎన్టీఆర్ కు భార‌తర‌త్న ఇవ్వాలి" అంటూ టీడీపీ నేత‌లు నినాదాలు చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఎన్టీఆర్ జ‌యంతి మే 28 - వ‌ర్ధంతి జ‌న‌వ‌రి 18. ఈ రెండు రోజులే టీడీపీ నాయ‌కులు ఆ మ‌హానేత‌కు భారతరత్న పై డిమాండ్ చేస్తుంటారు. ఆ త‌ర‌వాత ఆ ఊసే ఎత్త‌రు! ఇంకా చెప్పాలంటే... ఆయ‌న మ‌ర‌ణానంత‌రం చేస్తున్నంత తీవ్రంగా కూడా ఇప్పుడు ఆ విష‌యంపై పోరాటం చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగ‌స్వామి ఉండటం, అందులో చంద్ర‌బాబుది కీల‌క‌పాత్ర‌ కావడం తెలిసిందే! ఈ క్రమంలో కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడితో క‌ల‌సి, మోడీపై బాబు ఒత్తిడి తేగ‌లిగితే ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న పుర‌స్కారం రావ‌డం ఏమంత క‌ష్ట‌మైన కాదనేది అందరి అభిప్రాయంగా ఉంది! కానీ, ఈ విష‌యంలో బాబు మౌనం వ‌హించడం పెద్దయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదనే అనుకోవాలి. హైద‌రాబాద్‌ లోని విమానాశ్ర‌యం టెర్మిన‌ల్‌ కు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రిని డిమాండ్ చేసే రేవంత్‌ రెడ్డి లాంటివాళ్లు, భార‌త‌ర‌త్న విష‌యంలో బాబు కలిసి మోడీపై ఒత్తిడి తేవాల‌ని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News