ఒకవైపు నామినేషన్ల దాఖలు ఈ రోజు నుంచి మొదలైన నేపథ్యంలో.. అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తేలకపోవడం విశేష పరిణామంగా మారింది. దాదాపు నెలన్నర నుంచి చంద్రబాబు నాయుడు వివిధ నియోజకవర్గాల విషయంలో సమీక్షలు జరుపుతూ వచ్చారు. అయితే.. ఇప్పటి వరకూ ఆయన కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు - ఎంపీ సీట్లకు అభ్యర్థులను తేల్చలేకపోతూ ఉన్నారు.
ఒకవైపు నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా పెండింగ్ లో ఉంది. దాదాపు ముప్పైకి పైగా ఎమ్మెల్యే సీట్లకు చంద్రబాబు నాయుడు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఆ ముప్పై సీట్లలో కేవలం అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ లో ఉంది - అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్టే..అనేందుకు లేకుండా పోయింది.
తెలుగుదేశం పార్టీకి ఆ సీట్లలో చాలా పంచాయితీలున్నాయి. అభ్యర్థిత్వాల విషయంలో అభ్యంతరాలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు వాటిల్లో అభ్యర్థులను తేల్చలేకపోతూ ఉన్నారు. అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటనలూ చేయలేకపోతూ ఉన్నారు.
నామినేషన్ల ప్రక్రియకు మొత్తం ఎనిమిది రోజుల సమయం ఉంది. అందులో రెండు మూడు రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయని తెలుస్తోంది. అంటే కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్లకు అవకాశం ఉన్నట్టు. అందులో కూడా ముహూర్తాలను చూసుకోవడం అనేదీ ఉంటుంది.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఇంకా తుది జాబితాను విడుదల చేయకపోవడం విశేషం. తుది జాబితా విడుదల చేయడం అసలు కథ కాదు - విడుదల చేశాకా.. ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మరో కథ.
అభ్యర్థిత్వం విషయంలో ఒకరికి మించి నేతలు పోటీ పడుతున్న చోట… మరొకరు రాజీనామాలు చేయడం - రచ్చలు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఫైనల్ లిస్టులను పెండింగ్ లిస్టును ఎప్పుడు విడుదల చేస్తుందనేది సర్వత్రా ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది!